Chakri: ఒక సినిమా హిట్ అవ్వటానికి సంగీతం ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొన్ని సినిమాలు పాటల వల్లే హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన సంగీతాన్ని అందించే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు చక్రి. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి దాదాపు 85 సినిమాలకు పైగా అద్భుతమైన సంగీతాన్ని అందించిన చక్రి ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు. అయితే గుండెపోటు రావడంతో 2014లో ఆయన మరణించారు. చక్రి మరణం ఇండస్ట్రీలో తీరని లోటుని మిగిల్చింది.
ఇటీవల చిరకాల కోరికను ఆయన తమ్ముడు మహిత్ నారాయణ్ నెరవేర్చాడు. చక్రి మరణించిన తర్వాత ఆయన వారసుడిగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహిత్ నారాయణ తన అన్న చక్రి చిరకాల కోరికను నెరవేర్చినట్లు చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో మహిత్ మాట్లాడుతూ..’మా అన్నయ్య చనిపోవడం మాకు తీరని లోటు. ఆయన ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తెలియలేదు. ఇక ఇప్పుడు నేను ఆయన బాటలోనే సొంత స్టూడియో పెట్టి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. ఈ స్టూడియో అన్న చక్రి చిరకాల కోరిక. ఎప్పటికైనా ‘c’ స్టూడియో పెట్టాలని ఆశించారు. కానీ ఆయన ఉన్నప్పుడు కుదర్లేదు.
Chakri: C స్టూడియోస్ పెట్టిన మహిత్…
ఆయన కోరిక నెరవేర్చటానికి నేను స్టూడియో పెట్టి దానికి సీ స్టూడియోస్ పేరు పెట్టాం. సీ- అంటే చిరంజీవి అని అర్థం. చక్రికి చిరంజీవి అంటే చాలా అభిమానం. స్ఫూర్తి . అందుకే ఆయన కోరిక మేరకు ఈ స్టూడియో పెట్టాను‘ అంటూ మహిత్ చెప్పుకొచ్చాడు. చక్రి ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ఆయన అందించిన పాటలు ఇప్పటికీ మారుమోగుతూ ఉన్నాయి. ఇక చక్రి కోరిక నెరవేర్చడం కోసం సి స్టూడియోస్ ప్రారంభించిన మహిత్ కొన్ని సినిమాలకు సంగీతం అందించాడు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ‘ పరారీ ‘ సినిమాకు మహిత్ సంగీతం అందించాడు.