Chalaki Chanti: జబర్దస్త్ కమెడియన్ గా ప్రేక్షకులను మెప్పించిన చలాకి చంటి పలు సినిమాలలో పలు కీలక పాత్రలలో నటించి మెప్పించారు. ఇలా పలు సినిమాలలో నటించి వెండితెర పైన ఇటు బుల్లితెర పైన సందడి చేస్తున్నటువంటి చలాకీ చంటి గత బిగ్ బాస్ సీజన్ తెలుగు కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక బిగ్ బాస్ తర్వాత ఈయన పెద్దగా బుల్లితెరపై సందడి చేయలేదు. ఈ క్రమంలోనే ఈయనకు అవకాశాలు తగ్గాయని చాలామంది భావించారు. ఇకపోతే ఈనెల 21వ తేదీ చలాకి చంటి అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారని తెలుస్తోంది.
ఈనెల 21వ తేదీ చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు తనని ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు గుండెపోటు అని నిర్ధారించిన వెంటనే తనని ఐసియుకి తీసుకెళ్లి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.తాజాగా ఈయన హెల్త్ అప్డేట్ గురించి వైద్యులు తెలియజేస్తూ చంటి రక్తనాళాలలో పూడికలు ఉన్నాయని, అందుకే తనకు స్టంట్ వేసినట్లు వైద్యులు వెల్లడించారు.ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ తనని ఇంకా ఐసీయూలోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
Chalaki Chanti: స్టంట్ వేసిన డాక్టర్స్…
ఇలా చంటి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం.చలాకి చంటి ఆరోగ్యం గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయినప్పటికీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది లేదనే విషయాల గురించి ఆయన కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు గాని స్పందించకపోవడంతో పలువురు చంటి ఆరోగ్యం పై సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.