Chalaki Chanti: దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రంగా నటించిన చిత్రం RRR. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించిన కొమరం భీముడో పాటకు ఎలాంటి ఆదరణ లభించిందో అందరికీ తెలిసిందే. ఎన్నో రకాల ఎమోషన్స్ ను ఈ పాటలో ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా చూపిస్తూ ఈ పాటలో నటించడం కన్నా జీవించారు అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించారు.
సినిమా కథ మొత్తం కీలక మలుపు తిప్పే ఈ పాట ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. ఈ విధంగా ఎన్టీఆర్ ఎంతో ఎమోషన్ తో చేసిన ఈ పాటను జబర్దస్త్ కార్యక్రమంలో చలాకి చంటి తన స్కిట్ ద్వారా చూపించారు. అయితే ఈ పాటను మొత్తం తాగుబోతుల మందు పాటగా చిత్రీకరించి చూపించారు. ఈ సందర్భంగా చలాకి చంటి ఈ పాటను మందు పాటగా మారుస్తూ….విస్కీ దేవాలా,బ్రాండీ దేవాల, గ్లాసుల ఐసేసి మాకే బొయ్యాలా.. మాకే బొయ్యాలా.. కోడిని చూడాలా.. కోసి వండాలా.. ముక్క ముక్కకు తింటూ ఉండాలా అంటూ పూర్తిగా మార్చి తాగుబోతుల పాటగా చిత్రీకరించారు.

Chalaki Chanti: వీరుల పోరాటాన్ని చూపించే గొప్ప పాట…
ఇక ఈ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన ఎంతో మంది ఎన్టీఆర్ అభిమానులు చలాకి చంటి స్కిట్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన దేశ స్వాతంత్య్ర చరిత్రను, వీరుల పోరాటాన్ని చూపించే గొప్ప పాటను ఇలా అవమానపరుస్తారా..తమ అభిమాన నటుడు ఎంతో అద్భుతంగా నటించిన ఈ పాటను ఇలా చిత్రీకరించి నాశనం చేస్తారా అంటూ పెద్దఎత్తున చలాకి చంటి స్కిట్ పై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.