Chalaki Chanti: జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన వారిలో చలాకీ చంటి కూడా ఒకరు. ఎన్నో సినిమాలలో నటించిన చలాకి చంటి జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. జబర్దస్త్ షోలో తన కామెడీ టైమింగ్ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చలాకి చంటికి సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. అంతే కాకుండా పలు టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఒకవైపు జబర్దస్త్ మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే చలాకి చంటికి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం కూడా దక్కింది.
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైన చలాకి చంటి కొన్ని రోజులకి హౌస్ నుండి బయటికి వచ్చేసాడు.అయితే బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత చంటి ఎక్కువగా కనిపించడం లేదు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన మొదటిలో ఒకటి రెండు టీవీ షోలో కనిపించిన చంటి ఆ తర్వాత ఏ షో లో కనిపించలేదు. దీంతో చలాకి చంటికి అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యాడని అందరూ భావించారు. కానీ తాజాగా మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చలాకి చంటి ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి సినిమా అవకాశాలు లేకకాదని తెలిసింది.
Chalaki Chanti: గుండెపోటుకు గురైన చంటి..
అనారోగ్య సమస్యల వల్లే చంటి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..ఇటీవల చలాకి చంటి కి తీవ్ర గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్టు సమాచారం. చలాకి చంటి అనారోగ్యం గురించి తెలుసుకున్న అతని అభిమానులు తోటి నటీనటులు చలాకి చంటి అనారోగ్యం నుండి తొందరగా కోలుకోవాలని దేవుడుని ప్రార్థిస్తున్నారు.