Chalaki Chanti:చలాకి చంటి పరిచయం అవసరం లేని పేరు భీమిలి కబడ్డీ జట్టు సినిమా ద్వారా ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమైనటువంటి ఈయన ఈ సినిమా అనంతరం పలు తెలుగు సినిమాలలో కమెడియన్ గా నటించారు. అయితే ఈయనకు సినిమా అవకాశాలు కాస్త తగ్గిపోవడంతో బుల్లితెర కామెడీ షో అయినటువంటి జబర్దస్త్ కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి చలాకీ చంటి పలు బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ ఇక్కడే సెటిల్ అయ్యారు.
ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్లినటువంటి చంటి కొన్ని వారాల తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన ఎలాంటి బుల్లితెర కార్యక్రమాలలోనూ సందడి చేయలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే గత రెండు నెలల క్రితం చంటి అనారోగ్యానికి గురయ్యారని ఈయన పరిస్థితి దారుణంగా ఉంది అంటూ ఈయన ఆరోగ్యం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి.
Chalaki Chanti: జబర్దస్త్ లో సందడి చేయనున్న చంటి..
ఇక ఈయన గుండెపోటుకు గురయ్యారంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈయన చికిత్సకు అండగా అనసూయ నిలబడ్డారని ఆమె కూడా సహాయం చేశారు అంటూ ఈయన ఆరోగ్యం గురించి వార్తలు రావడంతో ఒక్కసారిగా అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఈ వార్తలు వచ్చి రెండు నెలల అయిన తర్వాత ఈయన ఒక్కసారిగా జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. వచ్చే వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా చలాకి చంటి కనిపించడంతో ఈయన ఆరోగ్యం కుదట పడినట్లేనా అందుకే తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.