Chandini Chowdary: తెలుగమ్మాయిలకు సినిమా ఇండస్ట్రీలో ఆదరణ తక్కువనే మాట ఎప్పుడూ వినిపించేదే. కొత్త మూవీ ఏదైనా మేకర్స్ ప్లాన్ చేస్తుంటే ముంబై నుంచి మోడల్స్‌ను తీసుకువచ్చి టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశం ఇవ్వ్డడం..స్టార్ స్టేటస్ కట్టబెట్టడం చేస్తున్నారు గానీ, మా తెలుగమ్మాయిలకు మాత్రం అవకాశాలివ్వడం లేదని ఇక్కడ తెలుగు హీరోయిన్స్ కొంతమంది వాపోతున్నారు. మరి అవకాశం ఇస్తే కూడా ఆలోచించి చేతివరకు వచ్చినవాటిని పోగొట్టుకున్న తెలుగమ్మాయిలను ఏమనాలి. వాళ్ళ బ్యాడ్‌లక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
అలా అద్భుతమైన రెండు అవకాశాలు చేతివరకు వస్తే చేజార్చుకుంది తెలుగమ్మాయి చాందిని చౌదరీ. షార్ట్ ఫిలింస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది చాందినీ చౌదరీ. ఆ తర్వాత అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ సరసన హౌరా బ్రిడ్జ్ అనే సినిమాలో హీరోయిన్‌గా చేసి ఆకట్టుకుంది. అయితే, చాందినికి స్టార్ హీరోయిన్‌గా మాత్రం క్రేజ్ దక్కకపోవడానికి కారణం ఆమె స్వయంకృతాపరాధమనే చెప్పాలి. గతంలో రాశీఖన్నా హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతూ చేసిన సినిమా ‘ఊహలు గుసగుసలాడే’. ఈ సినిమలో ముందు హీరోయిన్‌గా చాందినీనే మేకర్స్ అడిగారు.
Chandini Chowdary
కానీ, నాకు కొంత సమయం కావాలని చెప్పడంతో వారు రాశీని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇప్పుడు రాశీ పెద్ద హీరోయిన్‌గా వెలుగుతోంది. ఇక సుకుమార్ అసోసియేట్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన సినిమా ‘కుమారీ 21 ఎఫ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, హెబ్బా పటేల్ హీరోయిన్‌గా ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటించిన సంగతి తెలిసందే. ఇందులో హెబ్బా కంటే ముందు చాందినిని అడిగితే, ఆమె ఒప్పుకోలేదట. ఇలా రెండు భారీ చిత్రాలను చేయాల్సింది, చేతులారా పోగొట్టుకుంది. ఇవి చేసి ఉంటే టాలీవుడ్ మేకర్స్ దృష్ఠిలో పడి మంచి అవకాశాలు దక్కేవి. ఇప్పుడేమో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇక ‘కలర్ ఫొటో’ సినిమాతో హిట్ అందుకున్న చాందినీ, కిరణ్ అబ్బవరం సరసన ‘సమ్మతమే’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.