Chandrahas: తెలుగు బుల్లితెరకు చెందిన నటుడు ప్రభాకర్ నటుడుగానే కాకుండా నిర్మాత, దర్శకుడు, రచయిత, యాంకర్ గా కూడా బాధ్యతలు చేపట్టాడు. మొదటిగా చాణక్య సీరియల్ తో బుల్లితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఋతురాగాలు సీరియల్ తో ఇతనికి టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటించాడు.
ఎన్నో సీరియల్స్ లో నటించి బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. బుల్లితెర మెగాస్టార్ అనే బిరుదు పొందాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు. కూతురు దివిజ, కొడుకు చంద్రహాస్. చంద్రహాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు.
17వ తేదీ తన పుట్టినరోజు సంధర్భంగా శుక్రవారం ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్ పేరుతో మీడియా ముందుకు వచ్చాడు. అతను నటిస్తున్న సినిమాల పోస్టర్‌లను చంద్రహాస్ తల్లి మలయజ విడుదల చేసింది. మీడియా సమక్షంలో చంద్రహాస్ కేక్ కట్ చేసి ఓ రోజు ముందే పుట్టినరోజు జరుపుకున్నాడు.
చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతూ ఈ తరం హీరోల కు మించి నేను నటిస్తానని చెప్పాడు చంద్రహాస్. ఇక తను చేసిన ఈ సినిమా గొప్ప విజయాన్ని కూడా అందుకుంటుందని చాలా ఓవర్గా మాట్లాడటంతో ఇతనిపై ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఇతనికి రెండు సినిమాల్లో అవకాశం కూడా వచ్చిందట.
ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తన కొడుకు చదువులో, ఫైట్స్ లలో నటనలో మంచి ప్రాధాన్యత కలిగి ఉన్నవాడని చెప్పాడు. సినిమాల్లో తన లాగే తన తనయుడు కూడా రాణించాలని ఆశిస్తున్నానని చెప్పాడు. అలాగే చంద్రహాస్ తల్లి కూడా మాట్లాడుతూ తన కొడుకు మంచి గుర్తింపును తెచ్చుకుంటాడని చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడింది.
Chandrahas: ట్రోలర్స్ పై ఫైర్ అయినా నటుడు ప్రభాకర్..
అయితే దీన్ని చూసిన జనాలు చంద్రహాస్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారని చంద్ర హస్ పై విపరీతమైన ట్రోల్లింగ్ చేస్తున్నారు. దీనిపై స్పందిస్తూ.. ప్రభాకర్ తన కొడుకు పై ట్రోలింగ్ చేస్తే సహించేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన కొడుకు పై ట్రోస్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పారు.