Chiranjeevi – Balakrishna: మామూలుగా కొన్ని కొన్ని సమయాలలో స్టార్ హీరోలా ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. నిజానికి హీరోల మధ్య ఎటువంటి భేదం లేకున్నప్పటికీ కూడా వారి అభిమానుల మధ్య మాత్రం బాగా విభేదాలు ఉంటాయి. ఇద్దరు హీరోలు బాగా ఉన్నప్పటికీ హీరోల అభిమానులు మాత్రం అస్సలు కలవరు. ఇక ఇది ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఇటువంటి ఫ్యాన్స్ వార్ ఎక్కువగా ఉంది.
తమ హీరోలకు సంబంధించిన సినిమాలు విడుదలయితే చాలు ఆ సమయంలో భీభత్సం మరీ ఎక్కువగా ఉంటుంది. మా హీరో గొప్ప కాదు మా హీరో గొప్ప అంటూ బాగా నినాదాలు చేస్తుంటారు. అదే మల్టీ స్టార్టర్ గా ఏదైనా సినిమాలు వస్తే అందులో దర్శకుడు పొరపాటున ఒక హీరోని తక్కువ చేసి చూపిస్తే చాలు ఫ్యాన్స్ మామూలుగా చెలరేగరు. అందుకే చాలామంది దర్శకులు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేయడానికి బాగా ఆలోచిస్తూ ఉంటారు.
గతంలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో కూడా డైరెక్టర్ చాలా జాగ్రత్త పడుతూ ఇద్దరు హీరోల పాత్రలకు సమానం న్యాయం చేశాడు. అయితే ఇదంతా పక్కన పెడితే.. ఈ సంక్రాంతికి బాలయ్య, చిరంజీవి పోటీకి వస్తున్న సంగతి తెలిసిందే.బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమాల ట్రైలర్ లు కూడా విడుదల కాగా అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు టైలర్ చూసి బాగా ఆసక్తిగా ఉన్నారు.
Chiranjeevi – Balakrishna అక్కడ ముందున్న బాలయ్య..
అయితే మరొక విషయం ఏంటంటే.. ఈ ఇద్దరు హీరోలకు అభిమానులు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ ఇద్దరి హీరోలలో ఎవరో ఒకరు వెనుకంజలో ఉంటే మాత్రం ఫ్యాన్స్ వార్ తప్పదు అన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాల అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ఎక్కువగా ఉండగా బాలయ్యదే పై చేయి అన్నట్లుగా అనిపిస్తుంది. మరోవైపు మెగా అభిమానులు కూడా ఎలాగైనా తమ అభిమాన హీరో సినిమాను హిట్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ ఈ హీరోల అభిమానుల మధ్య ఏదైనా విభేదం వస్తే ఫ్యాన్స్ వార్ గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తుంది.