Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు చిరంజీవి అంటేనే కుటుంబ కథా చిత్రాలు ప్రేమకథా చిత్రాలు యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.ఇలా ఈయన హీరోగా ఎన్నో విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఇలా ఫ్యామిలీ హీరోగా యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవిలో కామెడీ యాంగిల్ కూడా దాగి ఉందని అతనిలో దాగి ఉన్న ఈ యాంగిల్ ను బయట పెట్టారు డైరెక్టర్ జంధ్యాల. చిరంజీవి యాక్షన్ హీరో జంధ్యాల కామెడీ సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు.
ఇకపోతే ఈ సినిమా గురించి ప్రకటన వెలువడటంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉంటుందా అని అభిమానులు ఎంతో మంది దర్శక నిర్మాతలు సైతం ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ రచయితల నవల ఆధారంగా ఎన్నో సినిమాలలో నటించారు.యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా ఈయన అభిలాష ఛాలెంజ్ రాక్షసుడు మరణ మృదంగం వంటి ఎన్నో సినిమాలలో చేశారు. ఇలా నవల రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ఆధారంగా చిరంజీవి సుహాసిని వంటి వారు నటీనటులుగా జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా చంటబ్బాయి.

Chiranjeevi: నవల ఆధారంగా తెరకెక్కిన చంటబ్బాయి సినిమా…
ఈ చంటబ్బాయి అనే నవల వార పత్రికలో ఒక సీరియల్ మాదిరిగా ప్రచురితమైంది. అయితే ఈ నవల ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది.ఇలా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ నవల ఆధారంగా సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో జంధ్యాల గారు ఈ సినిమా చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి జేమ్స్ బాండ్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి నవ్వుతూనే తనకు కావలసిన సమాచారం మొత్తం రాబట్టుకొని ఒక డిటెక్టివ్ పాత్రలో కనిపిస్తారు.ఇలా చెంటబ్బాయి సినిమా ద్వారా జేమ్స్ బాండ్ చిరంజీవిలో ఉన్నటువంటి కామెడీ యాంగిల్ కూడా బయటపెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సినిమా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. డైరెక్టర్ జంధ్యాల చిరంజీవిలో దాగి ఉన్న ఈ కామెడీ యాంగిల్ కూడా బయటపెట్టారు.