Chiranjeevi: 103 డిగ్రీల జ్వరంలోనూ శ్రీదేవితో డ్యాన్స్.. అతిలోక సుందరి అంటే ఆ మాత్రం కష్టపడాలి మరీ!

Akashavani

Chiranjeevi: తెలుగు చిత్రసీమకు మెగాస్టార్ చిరంజీవి పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 150 సినిమాలకు పైగా నటించి తెలుగు ఇండస్ట్రీలో నటనలో తనకంటూ చెరగని ముద్రవేసుకున్నాడు. రెండు తరాల ప్రేక్షకులను తన యాక్టింగ్ తో అదరగొట్టాడు చిరంజీవి. ఇక తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి అభిమానం అంతా ఇంతా కాదు.

మొత్తానికి చిరు టాలీవుడ్ అగ్ర స్టార్ట్ హీరో లలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక తాజాగా ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ప్రేక్షకుల్లో సినిమా పరంగా పాజిటివ్ టాక్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నిన్న అనగా మే 1న కార్మికుల దినోత్సవం సందర్భంగా యూసఫ్ గూడా లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వెళ్ళాడు.

ఈ సందర్భంగా చిరంజీవి తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను వివరించాడు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చేస్తున్నప్పుడు నేను 103 జ్వరంతో బాధ పడుతున్నాను. ఆ టైంలో శ్రీదేవితో కలిసి డాన్స్ చేయాల్సి వచ్చింది. ఇక నేను అదే విధంగా బాధపడుతూనే శ్రీదేవితో డాన్స్ చేశాను. షూటింగ్ అయిన వెంటనే 15 రోజులు రెస్ట్ తీసుకున్నాను అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.

Chiranjeevi: 103 డిగ్రీల జ్వరంలోనూ శ్రీదేవితో డ్యాన్స్.. అతిలోక సుందరి అంటే ఆ మాత్రం కష్టపడాలి మరీ!
Chiranjeevi: 103 డిగ్రీల జ్వరంలోనూ శ్రీదేవితో డ్యాన్స్.. అతిలోక సుందరి అంటే ఆ మాత్రం కష్టపడాలి మరీ!

Chiranjeevi: షూటింగ్ విషయం లో చిరు కి ఎదురైనా మరో కష్టం ఇదే!

అంతేకాకుండా ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కోసం ముంబై నుంచి హైదరాబాద్ తిరగాల్సి వస్తుందని జర్నీ వల్ల నేను చాలా వరకు డల్ అవుతున్నాను అని తెలిపాడు. ఇక నేను డల్ గా ఉన్నాను అని చెబితే ఆ రోజు షూటింగ్ ఆగిపోతుందని ఆ ఎఫెక్ట్ టోటల్ టీం మొత్తానికి పడుతుందని చిరంజీవి వెల్లడించాడు.

అందుకే అలాంటి ఇబ్బందులు సాధారణంగా బయటకు చెప్పను అని చిరంజీవి చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తాను షూటింగ్ కి వెళ్ళకుండా ఆగిపోతే మిగతా ఆర్టిస్టులు కూడా డల్ అవుతారని చెప్పుకొచ్చాడు. అతడే కాకుండా అప్పటి ఆర్టిస్టులు అందరూ అదే ఉద్దేశంతో షూటింగ్ విషయంలో మంచి నిబద్ధతతో ఉండే వారని చిరంజీవి చెప్పుకొచ్చాడు.

- Advertisement -