Chiranjeevi:  చిన్న యాడ్ కు చిరంజీవి అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడా.. వామ్మో!

Akashavani

Chiranjeevi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి అనే పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 150 సినిమాలకు పైగా నటించి తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక చిరు అభిమానుల గురించి మనకు తెలుసు. చిరు నటన ఒక ఎత్తు అయితే.. అతని బ్రేక్ డాన్స్ మరో ఎత్తు అని చెప్పవచ్చు.

మొన్నటి వరకు కుర్ర హీరోలకు సైతం పోటీగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు చిరు. గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న చిరు తన అభిమానులను ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటాడు. ఇక చిరంజీవి సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అభిమానులకు పంచుకుంటాడు.

ఆ మధ్య చిరు కరోనా కారణంగా దాదాపు ఒక పది రోజులకు పైనే హైదరాబాదులో ఒక ఇంటిలో హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపాడు. తద్వారా బోలా శంకర్ షూటింగ్ కూడా బేక్ పడినట్లు తెలిపాడు. ఇక ఇదంతా పక్కన పెడితే చిరు తాజాగా ఒక యాడ్లో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఆ యాడ్లో చిరు తో పాటు అనసూయ, సీనియర్ యాక్టర్ ఖుష్బూ కూడా నటించారు.

Chiranjeevi:  చిన్న యాడ్ కు చిరంజీవి అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడా.. వామ్మో!
Chiranjeevi:  చిన్న యాడ్ కు చిరంజీవి అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడా.. వామ్మో!

Chiranjeevi: ఆ యాడ్లో నటించిన అందుకు చిరంజీవి ఇంత రెమ్యునేషన్ తీసుకున్నాడు!

చిరు థంప్స్ అప్ యాడ్ తర్వాత చాలా ఏళ్ళకి చేసిన ఈ యాడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇది చూసిన చిరంజీవి అభిమానులు మరో లెవెల్లో మెచ్చుకుంటున్నారు. ఇక ఈ యాడ్ చేసినందుకు చిరు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు ఏడు కోట్లు రెమ్యునేషన్ చిరు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా టాలీవుడ్ లో యాడ్ చేసినందుకు అతి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -