Chiranjeevi: ఆ అలవాటు నువ్వు మార్చుకోవా.. ఆ నటుడుకి క్లాస్ పీకిన చిరంజీవి!

Akashavani

Chiranjeevi: టాలీవుడ్ ప్రపంచానికి మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. దాదాపు 150 సినిమాలకు పైగా నటించి రెండు తరాల ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు చిరు. ఇక చిరు నటన ఒక ఎత్తయితే.. చిరు బ్రేక్ డాన్స్ మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఇక చిరు సరసన నటించడానికి ఏ హీరోయిన్ ఐనా ముచ్చట పడాల్సిందే.

ఇక చిరంజీవి టాలీవుడ్ అగ్ర స్టార్ హీరోలలో తాను ఒక్కడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక చిరు సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఒక మంచి ఫాలోయింగ్ ఎర్న్ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానుల తో ముచ్చట్లు కూడా పెడుతుంటాడు.

ఇక చిరంజీవిని ఫాలో అయ్యే వారు చాలా మంది ఉన్నారు. అందులో సెలబ్రెటీలు కూడా ఉన్నారు. ఇక చిరంజీవినే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక మంచి స్థానంలో ఉన్న వ్యక్తి రాజా రవీంద్ర గురించి మనందరికీ తెలుసు.

Chiranjeevi: ఆ అలవాటు నువ్వు మార్చుకోవా.. ఆ నటుడుకి క్లాస్ పీకిన చిరంజీవి!
Chiranjeevi: ఆ అలవాటు నువ్వు మార్చుకోవా.. ఆ నటుడుకి క్లాస్ పీకిన చిరంజీవి!

Chiranjeevi: చిరంజీవి రాజా రవీంద్రను క్లాస్ పీకడానికి కారణం ఇదే!

ఇక తాజాగా రాజా రవీంద్ర ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆచార్య సినిమా షూటింగ్ లో చిరంజీవి తనని తిట్టారు అన్న విషయాన్ని తెలిపాడు. సినిమా షూటింగులో అలా లుక్కేసి చూడొద్దు అలా చూస్తే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుందని చిరంజీవి అన్నయ్య ఒక లక్ష సార్లు చెప్పాడు.

కానీ నేను ఆ విషయం గురించి మర్చి పోయి ఆ షూటింగ్ లో అలానే చూస్తున్నాను. దానికి చిరంజీవి అన్నయ్య దరిద్రం ఎన్నిసార్లు చెప్పినా.. వీడు మాత్రం అలా చూడ్డం మానడు అని అన్నారు. దాన్ని నేను ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వేసాను అని రాజా రవీంద్ర పలు విషయాలు చెప్పుకొచ్చాడు.

- Advertisement -