Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరి సహాయం లేకుండా అంచలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా చిరంజీవి చెరగని ముద్ర వేసుకున్నాడు. కొంతకాలం రాజకీయాల వల్ల సినిమాలకు దూరమైన చిరు మళ్లీ రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా హిట్ అందుకున్న చిరు ఆ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరు క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. ఈ వయసులో కూడా ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ కుర్ర హీరోలకు గట్టి పోటీగా నిలుస్తున్నాడు.
ఇదిలా ఉండగా మెగా వారసుడు రామ్ చరణ్ కి ఇటీవల కూతురు జన్మించటంతో చిరంజీవి తెగ సంబరపడిపోతున్నాడు. తమ ఇంటికి వారసురాలు అడుగుపెట్టిందని మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనందకర సమయంలో చిరంజీవి సురేఖ దంపతులు వెకేషన్ కోసం అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో వారి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్యతో కలిసి అమెరికా వెళ్లడానికి చిరంజీవి విమాన ప్రయాణానికి అధిక మొత్తంలో ఖర్చు చేసినట్లు వార్త వినిపిస్తోంది.
Chiranjeevi: లక్షల ఖర్చు చేసిన మెగాస్టార్…
సోషల్ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. అమెరికా వెళ్లడానికి చిరంజీవి – సురేఖ దంపతులు ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణానికి వీరు ఏకంగా 8 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇలా వీరు విమాన ప్రయాణం కోసమే 8 లక్షల రూపాయలు ఖర్చు చేయడంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కొందరు నెట్టుజన్లు ఆ ఖర్చుతో ఎంతో మంది పేదవాళ్లు కడుపు నింపవచ్చు అని కామెంట్లు చేస్తుంటే మరికొందరు మెగా అభిమానులు మాత్రం చిరంజీవికి ఉన్న ఇమేజ్ కి ఆ ఖర్చు చాలా తక్కువ అంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.