Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి చిరంజీవి గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలు స్వయంగా చిరంజీవి ఇంటికి వచ్చి తన దేవుడి గదిలో చిరంజీవికి రాఖీ కట్టి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ప్రస్తుతం చిరంజీవికి తన చెల్లెలు రాఖీ కట్టినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియోలో భాగంగా ఓ రహస్యం బయటపడింది. చిరంజీవి పూజ గదిలో ఎవరు ఊహించని విధంగా ఇద్దరు వ్యక్తుల ఫోటోలు ఉన్నాయి. ప్రతిరోజు దేవుళ్ళతో సమానంగా ఈ ఇద్దరు వ్యక్తులకు చిరంజీవి కుటుంబ సభ్యులు పూజలు చేయడం గమనార్హం. మరి చిరంజీవి పూజ గదిలో ఉన్నటువంటి ఆ ఇద్దరి ఫోటోలు ఎవరివి అనే విషయాన్ని వస్తే..
Chiranjeevi: దైవ స్థానం కల్పించిన చిరు..
చిరంజీవికి జన్మనిచ్చి ఆయనను ఎంతో క్రమశిక్షణగా పెంచి మంచి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి తన తండ్రి వెంకట్రావు ఫోటోతో పాటు తనకు పిల్లనిచ్చి తన కెరీయర్లో తనని ఎంతో ప్రోత్సహిస్తూ తన ఎదగదలకు కారణమైనటువంటి తన మామయ్య అల్లు రామలింగయ్య చిత్రపటాన్ని కూడా చిరంజీవి దేవుడి గదిలో పెట్టి పూజిస్తున్నారు. ఈ విధంగా చిరంజీవి తన తండ్రి మావయ్య ఇద్దరిని కూడా దైవ సమానంగా భావించి వారికి దైవ స్థానం కల్పించి వారిని పూజిస్తున్నారనే విషయం తెలియడంతో చిరంజీవి గొప్ప వ్యక్తిత్వం పై పలువురు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.