Sreeja Daughter: మెగా డాటర్ శ్రీజ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె తన వ్యక్తిగత విషయాల ద్వారా మాత్రం పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినటువంటి ఈమె తన ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చి తన పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నారు. ఈమె కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నవిష్క అనే కుమార్తె కూడా జన్మించారు. పాప పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ వీరి విడాకుల విషయాన్ని ఎక్కడ అధికారకంగా ప్రకటించలేదు కానీ ఇద్దరు మాత్రం విడిగా ఉంటున్నారు ఇకపోతే విడాకులు తీసుకున్న తర్వాత చిన్నారి నవిష్క శ్రీజ వద్దే ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈమె అప్పుడప్పుడు తన తండ్రి కళ్యాణ్ దేవ్ వద్దకు కూడా వెళ్తూ ఉంటారు. ఇలా కళ్యాణ్ దేవ్ తన కుమార్తె తన వద్దకు వచ్చినప్పుడు తన కూతురితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని ఆవేదనను తెలియజేస్తూ ఉంటారు.
తండ్రితో నవిష్క దీపావళి సెలబ్రేషన్స్…
ఇక దీపావళి పండుగ సందర్భంగా సెలబ్రిటీలందరూ కూడా దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కళ్యాణ్ సైతం తన కూతురితో కలిసి ఈసారి దీపావళి పండుగను జరుపుకున్నారని తెలుస్తుంది. ఇలా తన కూతురితో కలిసి దీపాలు వెలిగిస్తూ ఉన్నటువంటి ఫోటోలను కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ తల్లి లేకుండా నవిష్క తన తండ్రి వద్ద దీపావళి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.