Chiranjeevi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో మంచి ఆవినాభావ సంబంధం ఉంది రాజకీయాలలో ఉన్నటువంటి వారు ఇండస్ట్రీలోకి రావడం సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు రాజకీయాలలోకి వెళ్లడం ఎప్పటినుంచో జరుగుతుంది.అయితే ఇండస్ట్రీలో హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు పొందిన మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే చిరంజీవి మాత్రం రాజకీయాలు తనకు సూట్ కావనీ తిరిగి సినిమాలలోకి వచ్చారు.అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కొనసాగుతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా బ్రదర్ నాగబాబు కూడా నిలబడ్డారు. ఇలా వీరంతా ఒకే ఫ్యామిలీ నుంచి రాజకీయాలలోకి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం వీరి ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయని తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ వైసీపీతో పోరాటం చేయగా చిరంజీవి మాత్రం వైసీపీకి సానుకూలంగా మాట్లాడుతూ వ్యవహరిస్తున్నారు. ఏపీకి అమరావతి రాజధాని కావాలని పవన్ పోరాటం చేస్తుండగా చిరంజీవి మాత్రం తాను వైజాగ్ వెళ్తానని కామెంట్ చేశారు.ఇలా ఒకే కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి రాజకీయాలలోకి వచ్చిన ఈ సోదరులు విభిన్న ఆలోచనలు అందరిని అయోమయానికి గురి చేస్తున్నాయి.
Chiranjeevi: రాజకీయాల్లో నేను ఉండలేను…
ఇక ఈయన నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక వైజాగ్ లో జరగడం ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తాను త్వరలోనే వైజాగ్ షిఫ్ట్ అవ్వబోతున్నానంటూ చేసినటువంటి కామెంట్స్ కూడా ఈ అనుమానాలకు కారణం అవుతున్నాయి. తాను రాజకీయాలలో ఉండలేనని తను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని తెలిపారు.ఇక వైజాగ్ లో నివసించాలనుకోవడం నా చిరకాల కోరిక నేను వైజాగ్ లో మాత్రమే కాదు గోవాలోనూ ఊటీలో కూడా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను ఇలా ఇల్లు కట్టుకున్నంత మాత్రాన రాజకీయాలకు సపోర్ట్ చేసినట్టు కాదు అంటూ చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడటానికి కూడా ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఇలా రాజకీయాల గురించి మెగా బ్రదర్స్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.