Chiranjeevi: రాజకీయాల్లోకి వెళ్లి తాప్సీని మిస్ అయ్యాను.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

Akashavani

Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులు తాప్సీ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. ఇక హిందీ, తమిళ్ ప్రేక్షకులతో కూడా ఈ ముద్దుగుమ్మ మంచి ర్యాపో పెంచుకుంది.

ఇక తాప్సీ ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతుంది. కొంతకాలం నుంచి తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తాప్సీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఏదో ఒక పోస్టు తో ఆమె అభిమానులతో ముచ్చట పెడుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే తాప్సీ మెయిన్ రోల్ చేస్తున్న మిషాన్‌ ఇంపాజిబుల్‌ చిత్రం మనకు తెలుసు.

కాగా ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. చిరంజీవి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాప్సీ నటనను వివరించి తన మనసులోని మాటను బయట పెట్టాడు. అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Chiranjeevi: రాజకీయాల్లోకి వెళ్లి తాప్సీని మిస్ అయ్యాను.. చిరంజీవి కామెంట్స్ వైరల్!
Chiranjeevi: రాజకీయాల్లోకి వెళ్లి తాప్సీని మిస్ అయ్యాను.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

Chiranjeevi: తాప్సీ ను చిరంజీవి ఈ విధంగా మిస్ అయినట్లు తెలిపాడు.

నేను రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తాప్సీ లాంటి ఆర్టిస్టులతో నటించే అవకాశం దక్కించుకోలేక పోయాను. ఇలాంటి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను నేను చూసినప్పుడు నేనెందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని అనిపిస్తుంది. అంతేకాకుండా అవకాశం వస్తే తాప్సీతో సినిమా చేయాలని ఉంది అని చిరంజీవి ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తన మనసులోని మాటను బయట పెట్టాడు.

ఇక తాప్సీ రాబోయే సినిమాల విషయానికొస్తే.. బ్లర్ అనే సినిమాలో నటిస్తుంది. కాగా ఈ చిత్రానికి అజయ్ బల్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా మిషన్ ఇంపాజిబుల్ అని ఇంగ్లీష్ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాలలో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

- Advertisement -