Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులుగా మంచి గుర్తింపు పొందారు అలా దర్శకుడిగా గుర్తింపు పొందిన వారిలో కృష్ణవంశీ కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించిన కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి అయితే చాలా కాలంగా కృష్ణవంశీ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు గోవిందుడు అందరివాడే సినిమా తర్వాత కృష్ణవంశీ ఒక్క సినిమాకి కూడా దర్శకత్వం వహించలేదు. కానీ చాలా కాలం తర్వాత ప్రస్తుతం రంగమార్తాండ సినిమా ద్వారా మళ్ళీ తన టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం రంగమార్తాండ సినిమా షూటింగ్ పనులలో కృష్ణవంశీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కృష్ణవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ…” చిరంజీవి గారితో నాకు మంచి అనుబంధం ఉంది. అయినా కూడా ‘రంగమార్తాండ’ కి వాయిర్ ఓవర్ చెబుతారా.?’ అని ఆయనని అడగడానికి నేను చాలా భయపడ్డాను. కానీ ఆ తర్వాత ‘ఎందుకయ్యా భయం’ అని ఆయన అనగానే నేను షాక్ అయ్యాను.
Chiranjeevi: చిరంజీవి ఒక శిఖరం…
కానీ ఇండస్ట్రీ లో అంత స్టార్ ఇమేజ్, రేంజ్ ఉన్న ఆయన దగ్గరికి వెళ్లి వెంటనే అడగలేం కదా. ఆయన ఒక శిఖరం ..ఆయన ముందు మనం డాన్సులు చేయకూడదు. మన లిమిట్స్ లో మనం ఉండాలి ” అంటూ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ సందర్భంగా గతంలో చిరంజీవితో ఒక తీయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ షూటింగ్ మొదలుకాకుండానే ఆగిపోయిందని కృష్ణవంశీ వెల్లడించాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగమార్థాండ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.