Chiranjeevi: విలక్షణ నటుడు నాజర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన నాజర్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాజర్ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రేక్షకులకు తెలియజేశాడు. నాజర్, చిరంజీవి ఇద్దరూ ఒకే యాక్టింగ్ స్కూల్లో చదువుకున్నారు. అయితే యాక్టింగ్ కోర్సు పూర్తయిన తర్వాత చిరంజీవి సినిమాల్లో నటిస్తూ బిజీ అవ్వగా.. నాజర్ మాత్రం అవకాశాలు దొరకక హోటల్లో వెయిటర్ గా పని చేసేవాడు.
నాజర్ తాజ్ కోరమండల్ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేసే సమయంలో ఆ హోటల్ పక్కనున్న ఫిల్మ్ ఛాంబర్‌లో చిరంజీవిగారు షూటింగ్ చేస్తున్నారు. ఒకరోజు మధ్యాహ్న సమయంలో సైకిల్ మీద ఇంటికి వెళ్తుండగా షూటింగ్ చూడటానికి వెళ్ళిన నన్ను చిరంజీవి చూసి మాట్లాడానికి పిలిపించాడు. రేపు ఒకసారి వచ్చి నన్ను కలువు నేను నీతో మాట్లాడాలి అని అన్నారు. కానీ నేనూ చిరంజీవిని ఎప్పుడూ కలవలేదు. చిరంజీవి మా బ్యాచ్ లో పెద్ద స్టార్‌గా ఎదిగిన వాళ్లలో మొదటివాడు. నేను సినిమాల మీద నమ్మకం లేక హోటల్ కెరీర్ లో సెటిల్ అవుదామని నిర్ణయించుకున్నాను. బాలచందర్ గారు నాకు నటుడిగా అవకాశం ఇచ్చారు…అంటూ నాజర్ చెప్పుకొచ్చాడు.

Chiranjeevi: అమ్మను ఇబ్బంది పెట్టకు…
నాజర్ చిరంజీవితో కలిసి ఫిలిమ్ స్కూల్లో చదువుకునే సమయంలో ఉదయం 6 గంటలకు బయలుదేరి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కి వచ్చే వాడు. ఆ సమయంలో ఒక్కోసారి అన్నం మాత్రమే తెచ్చుకునే వాడు. కానీ ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్న తెలుగు వారందరూ ఆంధ్ర మెస్ నుంచి భోజనం తెచ్చుకొని తినేవారు. ఒక రోజు నేను అన్నం మాత్రమే తెచ్చుకోవటం గమనించిన చిరంజీవి పొద్దున్నే కెరేజ్ కోసం మీ అమ్మను ఎందుకు ఇబ్బంది పెడతావు. ఇంకొకసారి అలా చేస్తే నిన్ను చంపేస్తాను.. రేపటి నుండి నువ్వు మాతోనే కలిసి భోజనం చేయాలని చిరంజీవి అన్నాడు. ఇలా ఆ నాటి సంగతుల గురించి నాజర్ చెప్పుకొచ్చాడు.