Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్ ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకు ఆదరణ సంపాదించుకోలేకపోయింది ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ ఈ సినిమా మాత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకొంది.ఇక సినిమా అన్న తర్వాత జయపజయాలు సర్వసాధారణం అయితే ఈ సినిమా విడుదల అయ్యి నెగటివ్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత చిరంజీవి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ సినిమా డిజాస్టర్ కావడంతో చిరంజీవి తనకు రావలసిన రెమ్యూనరేషన్ నిర్మాత వద్ద ముక్కు పిండి మరి వసూలు చేశారని చిరంజీవి ఇబ్బంది పెట్టడంతో నిర్మాత తప్పనిసరి పరిస్థితులలో తన ఆస్తులు కూడా తాకట్టు పెట్టారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తన చిరంజీవి గురించి నిర్మాత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించిన అనిల్ సుంకర ఇవన్నీ అవాస్తవాలేననీ కొట్టి పారేశారు. అయితే ఈ సినిమా అనిల్ సుంకరకు మాత్రం నష్టాలను తీసుకువచ్చింది అనడంలో ఎలాంటి సందేహాలు లేవు.
Chiranjeevi: పది కోట్లు వెనక్కి…
ఈ విధంగా నిర్మాత అనిల్ సుంకరకు నష్టాలు రావడంతో చిరంజీవి కొంత మొత్తంలో రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చారని తెలుస్తుంది.ఈ సినిమా కోసం చిరంజీవి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట అయితే ఇందులో 50 కోట్ల రూపాయలు సినిమా షూటింగ్ సమయంలోనే చిరంజీవికి ఇచ్చేసారని మిగిలిన 10 కోట్ల రూపాయలను చెక్కు రూపంలో ఇవ్వాలని అది కూడా సినిమా విడుదలైన తర్వాత ఇవ్వాలని నిర్ణయించుకున్నారట అయితే సినిమా విడుదలైన తర్వాత డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో చిరంజీవి ఆ 10 కోట్ల రూపాయలను తీసుకోకుండా వెనక్కు ఇచ్చారని తెలుస్తోంది.అయితే గతంలో కూడా తన సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలకు చిరంజీవి ఇలాగే కొంత మొత్తంలో రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.