Chiranjeevi- NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్దాల నుండి కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి.. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు చిరంజీవి. ఇక ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు.
ఈయన ప్రతి ఒక్క దర్శక నిర్మాతలతో, చాలామంది హీరోయిన్లతో నటించాడు. అంతేకాకుండా స్టార్ హీరోలు ఎన్టీఆర్, సినిమాలలో కూడా నటించాడు చిరంజీవి. అయితే ఓసారి ఎన్టీఆర్ సినిమాలో చిరంజీవికి అవకాశం వస్తే.. చిరంజీవిని ఆ సినిమా నుంచి మధ్యలోనే తీసేసారట. ఇంతకీ చిరంజీవిని తీసేయడానికి కారణం ఏంటంటే..
కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొండవీటి సింహం సినిమాలో ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిరంజీవిని ఎన్టీఆర్ కొడుకు పాత్రలో తీసుకున్నారట. అయితే ఆ పాత్రలో తన తండ్రి అయిన ఎన్టీఆర్ ను విభేదిస్తూ పవర్ఫుల్ డైలాగులతో ఆయనను ఎదిరించాలట.
దీంతో ఐదు రోజుల షూటింగ్లో కూడా చిరంజీవి పాల్గొన్నాడట. ఆ సమయంలో చిరంజీవి కొత్తగా ఇండస్ట్రీకి అడుగు పెట్టాడట. ఇక ఆ సమయంలో టాప్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ ని ఎదిరిస్తూ డైలాగులు చెప్పేందుకు చిరంజీవి కాస్త తడబడ్డాడట. ఇదే కాకుండా ఆ సినిమాకు నెలరోజులు మాత్రమే క్యాల్షిట్లు ఇచ్చాడట ఎన్టీఆర్.

Chiranjeevi- NTR: ఎన్టీఆర్ సినిమాలో చిరంజీవిని మధ్యలో తీసేయడానికి కారణం ఇదే..
కానీ చిరంజీవికి ఆ పాత్రలో చేయటానికి సమయం పట్టడంతో.. ఆయన స్థానంలో మోహన్ బాబుని తీసుకున్నారట. అప్పటికే మోహన్ బాబు ఎన్టీఆర్ నటించిన సినిమాలో ఆయనకు ఎదురుపడే పాత్రలో నటించాడట. దీంతో ఆయన అయితే సులువుగా ఈ పాత్రను చేయగలడు అని మోహన్ బాబుని తీసుకున్నారట ఆ దర్శక నిర్మాతలు. అలా ఆ సినిమాలో ఎన్టీఆర్ ను ఎదిరించే డైలాగులు కొట్టడంలో చిరంజీవి ఇబ్బంది పడటం వల్ల ఆ పాత్రకు మోహన్ బాబు పూర్తి న్యాయం చేశాడట.