Chiranjeevi: టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో, డిస్ట్రిబ్యూటర్స్‌లో దిల్ రాజుకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందరూ ఆయనను లక్కీ ప్రొడ్యూసర్ అంటుంటారు. అంతేకాదు, ఆయన సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. దాదాపు తెలుగులో అందరు అగ్ర హీరోలతో సినిమాలు చేసిన దిల్ రాజు..ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నారు. అంతేకాదు, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా నిర్మాతగా సత్తా చాటాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో దిల్ రాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాను దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
అలాగే, తమిళ అగ్ర హీరో విజయ్‌తో తెలుగులో స్ట్రైట్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ వారసుడు కూడా ఇటీవలే రివీల్ చేశారు. ఇవి కాకుండా మరికొన్ని చిత్రాలను నిర్మిస్తున్నారు. శాకుంతలం లాంటి సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ చిరంజీవితో భారీ చిత్రాన్ని నిర్మించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ నిర్మించి హిట్ అందుకున్న దిల్ రాజు..పవన్ తో ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 10 ఏళ్ళు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆయనతో సినిమా తీసి తన కల నెరవేర్చుకున్నారు.
Chiranjeevi: ఇదే జరిగితే మెగా అభిమానులకు పెద్ద పండగే..!
ఇప్పుడు మెగా డ్రీం నెరవేర్చుకునే పనిలో ఉన్నారట. ప్రస్తుతం మెగాస్టార్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. 2023 వరకు ఈ సినిమాలతోనే సరిపోతుంది. అయితే, 2024, అయినా 2025లో అయినా మెగాస్టార్‌తో సినిమా చేయాలని అప్పటి వరకు ఆయనను వదిలేదే లేదని దిల్ రాజు పట్టుదలతో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు తలుచుకున్నారంటే కాస్త ఆలస్యం అయినా ప్రాజెక్ట్ లాక్ చేసేస్తారు. మరి ఈ మెగా ప్రాజెక్ట్ ఎప్పటికి సెట్ అవుతుందో..అదెలాంటి సినిమా అవుతుందో చూడాలి. ఇదే జరిగితే మెగా అభిమానులకు పెద్ద పండగే.