Chiranjeevi – Ram Charan: హీరోలకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు కంటే ఆ సినిమా ప్రభావం తరువాత అదే హీరోలతో సినిమా చేయబోతున్న దర్శకుల మీద ఎక్కువగా పడుతుంది. చెప్పాలంటే ఇది ఒక రకంగా బ్యాడ్‌లక్..ఇంకో రకంగా దర్శకుడు ప్రూవ్ చేసుకోవాల్సిన ఠఫ్ సిచ్యువేషన్. అప్పటి వరకు మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని హీరో ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తాడా..ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్ళాలా! అని ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి షాకులు తగిలితే ఆ దర్శకుడి పరిస్థితి ఎలా ఉంటుందో అనుభవిస్తున్నవాళ్లకే తెలుస్తుంది.
అలాంటి పరిస్థితి ఇప్పుడు మెగా హీరోలతో సినిమా ఓకే అయిన దర్శకులకు వచ్చిందని ఫిల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆచార్య భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా ప్రభావం కొరటాలపై గట్టిగా పడిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. అందుకే, ఆయన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా చేయాల్సిన సినిమా స్క్రిప్ట్ విషయంలో తారక్ ఇన్వాల్వ్ అయి కొన్ని మార్పులు సూచించినట్టు టాక్ వినిపించింది.
Chiranjeevi – Ram Charan:
ఇప్పుడిదే టాక్ చిరు – చరణ్ హీరోలుగా చేస్తున్న కొత్త ప్రాజెక్ట్స్ విషయంలోనూ జరుగుతున్నట్టు సమాచారం. చిరంజీవి యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములకు ఛాన్స్ ఇచ్చారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పటికే అధికారికంగానూ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అయితే, ఆచార్య ఫ్లాప్ తర్వాత వెంకీకి చిరు కథలో కీలక మార్పులు సూచినట్టు దాంతో దర్శకుడు మళ్ళీ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చించుకుంటున్నారు.
ఇక చరణ్ కూడా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటన వచ్చింది. ఈ సినిమాను ప్రభాస్ సన్నిహితులు యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ – ప్రమోద్ నిర్మించనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఇప్పుడు చరణ్ కూడా గౌతమ్ కి స్క్రిప్ట్‌లో పలు మార్పు చేర్పులు సూచినట్టు టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో గానీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో దీనిపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి ఒక్క ఆచార్య సినిమా ప్రభావం ఆ తర్వాత ఎంతమంది దర్శకులపై పడిందో దీనిని బట్టి తెలుస్తోంది.