Chiranjeevi వరుణ్ తేజ్..తన కొత్త సినిమా విడుదల కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న మెగా హీరో. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది. ఇటీవలే అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా హాజరై గని టీంలో జోష్ నింపాడు, వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడని, ఆకష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందని, గని టీంకు విషెస్ చెప్పాడు బన్నీ. ఈ సందర్భంగా తన మనసులో కోరికను అందరితో పంచుకున్నాడు వరుణ్ తేజ్.
తనకు మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఉందని చెప్పాడు. ప్రతీ రోజు పెద్దనాన్నను చూసి ఏవిధంగా స్పూర్తి పొందుతాడో చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. నేను ఓ సినిమాకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం గంటల వరకు పనిచేస్తున్న టైంలో..పెద్దనాన్న 3 సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటుంటారు. మూడు వేర్వేరు షిప్టుల్లో పనిచేస్తుంటారు. ఆయన క్రమశిక్షణే ఇవాళ పెద్దనాన్నను లెజెండ్‌గా మార్చేసింది. మేమందరం ఆయనదగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పెద్ద విషయం ఇది. చిరంజీవితో మల్టీస్టారర్ పై స్పందిస్తూ..నేను ఆయనతో నటించాలనుకుంటున్నానన్నాడు.
పెద్దనాన్న దగ్గర నుంచి ఎప్పుడు కాల్ వస్తుందా..? అని ఎదురుచూస్తున్నా. చిరంజీవి ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చినా సరే..ఆయన చేయబోయేసినిమా సెట్స్ లో వెంటనే చేరిపోతా. ఎంత చిన్న పాత్ర ఆఫర్ వచ్చినా చేయడానికి రెడీ. నేడు కాల్ కోసం ఎదురుచూస్తున్నట్టు పెద్దనాన్నకు తెలుసు. మరి ఏం జరుగుతుందో చూడాలని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ తొలిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
వరుణ్ తేజ్ కోరిక త్వరలోనే నెరవేరాలని విష్ చేస్తున్నారు మెగా అభిమానులు.