Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా రాఖీ పండుగ వేడుకలలో పాల్గొన్నారు. ఆయన చెల్లెలు స్వయంగా చిరంజీవి ఇంటికి వచ్చి తన అన్నయ్యకు రాఖీ కట్టి తన ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఈ రాఖీ పండుగ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పూజ గదితో పాటు ఆయన చేతికి ఉన్నటువంటి వాచ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చేతికి ఉన్నటువంటి ఈ వాచ్ ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
మెగాస్టార్ చిరంజీవి చేతికి ఉన్నటువంటి ఈ వాచ్ ఖరీదు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరికి దిమ్మ తిరగడం ఖాయమని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి తన చేతికి రోలెక్స్ కంపెనీకి చెందినటువంటి కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ ధరించారు. ఇక ఈ కంపెనీకి చెందిన ఈ వాచ్ ఖరీదు చాలా విలువ చేస్తుందనే సంగతి మనకు తెలిసిందే అయితే మరి ఈ వాచ్ ఖరీదు ఎంత అని సర్చ్ చేసిన నేటిజన్స్ కు దిమ్మ తిరిగిపోయిందని చెప్పాలి. మరి మెగాస్టార్ చిరంజీవి చేతికి ఉన్నటువంటి ఈ వాచ్ ఖరీదు ఎంత అనే విషయానికి వస్తే…
కోట్లు విలువ చేస్తున్న చేతి వాచ్…
చిరంజీవి చేతికి కట్టుకున్నటువంటి ఈ రోలెక్స్ వాచ్ ఖరీదు 2.35 లక్షల డాలర్స్ అని ఉంది అయితే దీనిని మన ఇండియా కరెన్సీ ప్రకారం చూస్తే ఏకంగా రెండు కోట్ల రూపాయల ధర పలుకుతుందనే విషయం తెలియడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి దగ్గర ఇలాంటి ఖరీదైన వాచెస్ బోలెడు ఉన్నాయని చెప్పాలి. ఇదివరకు బేబీ సినిమా ఈవెంట్ లో కూడా చిరంజీవి ఇలా రెండు కోట్ల విలువ చేసే ఖరీదైన వాచ్ ను ధరించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.