రిలీజ్ డేట్: జూన్ 24, 2022
నటినటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, సంపూర్ణేష్ బాబు, సునిల్ తదితరులు.
డైరెక్టర్: జీవన్ రెడ్డి
నిర్మాతలు: వి. ఎస్. రాజు
మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకాటి

డైరెక్టర్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా చోర్ బజార్. ఆకాష్ పూరి, గెహనా నటీనటులుగా నటించారు. ఇక ఈ సినిమా ఐ వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వి. ఎస్. రాజు నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఇక సురేష్ బొబ్బలి మ్యూజిక్ ను అందించాడు. జగదీష్ సినిమాటోగ్రఫీ అందించగా ఈ రోజు ఈ సినిమా థియేటర్లో విడుదలయ్యింది. ఇక మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆకాష్ పూరికి ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం. ఇదివరకే రెండు సినిమాలతో కొంత వరకు సక్సెస్ అందుకోగా ఈ సినిమాతో మరింత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.
కథ: హైదరాబాదులో చోర్ బజార్ అనే ఏరియాలో దొంగ సామాన్లు అమ్ముతూ ఉంటారు. ఇక ఆ ఏరియా మొత్తంను బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి) చూసుకుంటాడు. అక్కడ ఆయన ఏది చెబితే అదే నడుస్తుంది. అదే సమయంలో ఆయన సిమ్రాన్ (గెహనా సిప్పీ) ని ప్రేమిస్తాడు. సిమ్రాన్ మూగ అమ్మాయి. ఇక సిమ్రాన్ కూడా బచ్చన్ ను ప్రేమిస్తుంది. ఇక అప్పుడే హైదరాబాద్ మ్యూజియంలో రూ.200 కోట్ల విలువ చేసే నైజాం కాలం నాటి వజ్రం దొంగలించబడుతుంది. ఇక ఆ వజ్రంను ఎవరు దొంగలించారు.. ఆ వజ్రం కు, బచ్చన్ కి సంబంధం ఏంటి.. ఇక బచ్చన్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మిగిలిన కథలో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్: సురేష్ బొబ్బిలి అందించిన పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ఇక నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు. మూగ అమ్మాయి గా హీరోయిన్ బాగా నటించింది.
మైనస్ పాయింట్స్: చాలావరకు ఈ సినిమా ఎవరిని అంతగా ఆకట్టుకోలేదు అన్నట్లుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ లో ఇంకా మార్పులు ఉంటే బాగుండేది. నేపథ్య సంగీతం కూడా మామూలుగానే అనిపించింది. ఆకాష్ పూరి యాక్షన్ సన్నివేశాల్లో పర్వాలేదు అనిపించినా కూడా.. తన నటన మాత్రం కాస్త నిరుత్సాహం గానే ఉంది.
సాంకేతిక విభాగం: డైరెక్టర్ జీవన్ రెడ్డి సినిమా ప్రారంభంలో చాలా పాత్రలతో ముందుకు తీసుకెళ్లాడు. అంతేకాకుండా కథ మెయిన్ పాయింట్ నుంచి ఎక్కడికి వెళ్లి పోయిందో అన్నట్లుగా అనిపించింది. పైగా హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ కూడా రెగ్యులర్ గా చూసినట్లే అనిపించింది. ఇక సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం మాత్రం కొంతవరకు ఆకట్టుకుందని చెప్పవచ్చు. నిజానికి ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా అనిపించింది.
చివరి మాట: ఈ సినిమా పేరు ఆకట్టుకున్న కూడా కథ మాత్రం ఆకట్టుకోలేదు అన్నట్లుగా ఉంది. అంతేకాకుండా సినిమా మొదటి నుండి చివరి వరకు బోర్ అనే టాక్ వినిపిస్తుంది.
రేటింగ్: 2.5/5