TolTollywood: హిందీ చలనచిత్ర పరిశ్రమలో కొంతమేర ఫాస్ట్ కల్చర్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫాస్ట్ కల్చర్ కారణంగా చాలామంది సినీ సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా మరోవైపు మరికొందరు సినీ క్రిటిక్స్ పేరుతో చేస్తున్నటువంటి కొన్ని ఆగడాల కారణంగా కూడా కొందరు సినీ ప్రముఖులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తనకు తానుగా సినీ క్రిటిక్ అని చెప్పుకున్నటువంటి ఉమైర్ సందు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఉమైర్ సందు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ తరచుగా సోషల్ మీడియా మాధ్యమాలలో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
దీంతో తాను చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా నెటిజెన్లు అలాగే సినీ ప్రముఖుల అభిమానుల చేతుల్లో దారుణంగా ట్రోలింగ్ కి గురవుతున్నా కూడా తాను చేస్తున్న ఈ పనిని ఏమాత్రం ఆపడం లేదు. అయితే తాజాగా ఉమైర్ సందు ఏకంగా బాలీవుడ్ పై కాకుండా టాలీవుడ్ పై పడ్డాడు. ఈ క్రమంలో టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలపై అనుచిత వ్యాఖ్యలు అలాగే వారి గురించి అసత్య కథనాలు ప్రచారం చెయ్యడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఏకంగా టాలీవుడ్ ప్రముఖ హీరో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ అసభ్యకర ట్వీట్ చేశాడు.
ఈ క్రమంలో ఏకంగా బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖ సినీ నిర్మాత అలాగే ధర్మ ప్రొడక్షన్ స్థాపకుడు కరణ్ జోహార్ తో విజయ్ దేవరకొండ అఫైర్ పెట్టుకున్నాడని అలాగే లైగర్ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు కరణ్ జోహార్ ఇలాంటి ఆగడాలకు పాల్పడ్డాడని ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఉమైర్ సందు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉమైర్ సందు కి పిచ్చి పట్టిందని అందుకే ఇలా సినీ సెలెబ్రెటీల గురించి గలీజ్ గా ట్వీట్లు చేస్తున్నాడని వెంటనే అతడి ట్విట్టర్ ఖాతా ని సస్పెండ్ చేయాలని కూడా అంటున్నారు. అలాగే బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ నుంచి ఉమైర్ సందు ని బహిష్కరించాలని కూడా అంటున్నారు. నిన్నమొన్నటి వరకూ కేవలం బాలీవుడ్ ని టార్గెట్ చేసిన ఉమైర్ సందు ఇప్పుడు ఉన్నట్లుండి టాలీవుడ్ పై పడ్డాడు.
ఈ విషయము ఇలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కి జతగా టాలీవుడ్ ప్రముఖ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత నటిస్తోంది. టైగర్ చిత్రం అవడంతో కథల విషయంలో కొంతమేర ఆశీస్సులు అడుగులు వేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అంతేకాకుండా కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.