Colours Swathi: కలర్స్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత అష్టా చమ్మా సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కలర్ స్వాతి నటించిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకుని ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. ఇక వివాహం తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయినా స్వాతి ఇటీవల కాలంలో రెండు సినిమాలలో నటించి మళ్లీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఇదిలా ఉండగా కలర్స్ స్వాతి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న కూడా ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందలేకపోయింది. అందుకు కారణం ఆమె తల్లి అంటూ ఒక వార్త వైరల్ అయింది. సాధారణంగా షూటింగ్ సమయంలో హీరోయిన్స్ తమకి తోడుగా ఎవరో ఒకరిని తీసుకెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో స్వాతి కూడా తనతో పాటు తన తల్లిని కూడా షూటింగుకి తీసుకు వెళ్ళేది. అయితే షూటింగ్ జరిగే సమయంలో కూడా స్వాతి తల్లి ఆమె వెన్నంటే ఉండేది. దీంతో స్వాతి కొన్ని సన్నివేశాలలో నటించటానికి ఇబ్బంది కరంగా ఫీల్ అయ్యేదట.
Colours Swathi: అందుకే అవకాశాలు కోల్పోయారా…
అందువల్ల ఆమె రొమాంటిక్ సన్నివేశాలలో సరిగా నటించలేకపోవటమే కాకుండా తల్లి ఎల్లప్పుడూ పక్కనే ఉండటం వల్ల సెట్ లో ఎవరితో కూడా మాట్లాడేది కాదట. అందువల్ల దర్శక నిర్మాతలు కూడా స్వాతికి అవకాశాలు ఇవ్వటానికి నిరాకరించే వారిని తెలుస్తోంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందాల్సిన కలర్ స్వాతి తన తల్లి వల్ల మంచి జీవితాన్ని కోల్పోయింది అంటూ గతంలో ఒక వార్త వైరల్ అయింది. ఇక గత కొంతకాలంగా స్వాతి తన భర్తకి విడాకులు ఇవ్వబోతున్నట్లు మరొక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.