Comedian Ali: వెండితెరపై కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తన సినీ కెరియర్ లో ఎన్నో వందల సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.అయితే ప్రస్తుతం ఈయన సినిమాలు చాలా పూర్తిగా తగ్గించారని కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నారని తెలుస్తోంది.ఇలా అడపాదడపా సినిమాలలో నటిస్తున్నటువంటి ఆలీ బుల్లితెరపై ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి కూడా ఈయన కాస్త విరామం తీసుకున్నారు. ఇకపోతే తాజాగా సుమ వ్యాఖ్యాతగా సుమ అడ్డా అనే పేరుతో సరికొత్త షో ప్రారంభించారు.
ఈ కార్యక్రమం జనవరి ఏడవ తేది ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా మొదటి ఎపిసోడ్ లోనే కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ హాజరయ్యారు. అదే విధంగా నటుడు అలీ పోసాని కూడా ఈ కార్యక్రమంలో సందడి చేసినట్టు తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే సుమ తన మాట తీరుతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సందడి చేశారు.జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ ను ఎదురెదురుగా కూర్చోబెట్టి సుమా తనదైన స్టైల్ లో ప్రశ్నలు వేశారు.
Comedian Ali: చిరంజీవి ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు…
వీరిద్దరి తర్వాత పోసాని అలీ కూడా ఈ కార్యక్రమంలో హాజరై సందడి చేశారు. అయితే సుమ అడ్డాలో అలీ మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక షాకింగ్ విషయం బయటపెట్టారు. ఈ సందర్భంగా సుమ ఆలీని ప్రశ్నిస్తూ మీరు ఒకరిని ఎప్పుడు కలిసిన నవ్వేస్తారట ఎందుకు అని ప్రశ్నించింది ఈ ప్రశ్నకు ఆలీ సమాధానం చెబుతూ తాను మెగాస్టార్ చిరంజీవి గారిని ఎప్పుడు కలిసిన తన మొహం ఎక్కువ సేపు చూడటానికి ఇష్టపడనని తెలిపారు. ఆయన వైపు చూస్తూ ఉంటే అతను ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. అందుకే తన మొహం ఎక్కువసేపు చూడలేనని ఈ సందర్భంగా సుమ అడ్డాలో అలీ చిరంజీవి గురించి ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం అలీ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.