Comedian Avinash: కామెడీ షో జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకున్న ముక్కు అవినాష్ గురించి అందరికీ పరిచయమే. జబర్దస్త్ లో తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
జబర్దస్త్ కు ముందు అవినాష్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేసి.. అక్కడి నుండి జబర్దస్త్ లో అడుగు పెట్టి సెలబ్రేట్ హోదాను సొంతం చేసుకున్నాడు. వెండితెరపై కూడా అవకాశాలు అందుకొని పలు సినిమాలలో నటించాడు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అడుగుపెట్టి మరింత గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
బిగ్ బాస్ తరువాత అవినాష్ పలు షోలలో మాత్రం పాల్గొని బాగా సందడి చేస్తున్నాడు. ఇక బిగ్ బాస్ తర్వాత ఆయన అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. తన భార్యతో కలిసి ఇస్మార్ట్ జోడి లో కూడా పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.
తోటి ఆర్టిస్టులతో బాగా సందడి చేస్తూ ఉంటాడు. వారితో ఫన్నీ రీల్ చేస్తూ బాగా ఆకట్టుకుంటాడు. ఇప్పటికే శ్రీముఖితో పలు వీడియోలు చేసి బాగా సందడి చేశాడు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఈయన బిబి జోడీలో మరో బిగ్ బాస్ బ్యూటీ అరియానా తో జోడీగా ఉంటూ తనతో డాన్స్ లు చేస్తూ బాగా సందడి చేస్తున్నాడు. అయితే తాజాగా మరో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
Comedian Avinash: రాధని ఏడిపించేసిన ముక్కు అవినాష్..
ఇందులో సిని నటి రాధ జడ్జిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అవినాష్ అరియానాతో డాన్స్ చేయగా ఆ తర్వాత అవినాష్ సూపర్ స్టార్ కృష్ణ లాగా రాధ తో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే రాధ సూపర్ స్టార్ కృష్ణని తలుచుకొని ఆయనను మిస్ అయినందుకు బాగా ఎమోషనల్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.