Comedian Komaram: ఈటీవీలో ప్రచారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో కొమరం కూడా ఒకరు. కొమరం అంటే గుర్తు రాకపోవచ్చు కానీ కొమరక్క అంటే అందరికీ టక్కున గుర్తుకు వస్తుంది. జబర్దస్త్ లో కొమరక్కగా లేడీ గెటప్ లో కనిపించి తన పంచ్ డైలాగులు, సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ లో మాత్రమే కాకుండా బుల్లితెరలో ప్రసారమైన ఇతర టీవీ షోలో కూడా లేడీ గెటప్ లోనే కనిపిస్తూ ఉంటాడు.
అంతేకాకుండా బయట కనిపించినా కూడా అందరూ అతనిని కొమరక్క అనే పిలుస్తూ ఉంటారు. కొమరం అంతలా ఫేమస్ అయ్యాడు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు రావడంతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంటున్నాడు. తాజాగా విడుదలైన దసరా సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో నటించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొమరం తన జీవితంలో ఉన్న కష్టసుఖాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో కొమరం మాట్లాడుతూ..” ఇండస్ట్రీలోకి రాకముందు అన్ని పనులు చేశానని చెప్పుకొచ్చాడు. కోటిలో వస్తువులు అమ్మటమే కాకుండా కూడల్ల వద్ద పిల్లల స్కూల్ బ్యాగులు అమ్మేవాడిని. అంతే కాకుండా క్యాటరింగ్ లో కూడా పని చేసి అంట్లు తోమేవాడిని.
Comedian Komaram: ఐదేళ్లు నరకం అనుభవించా
కానీ ఇండస్ట్రీ లోకి వచ్చాక నా జీవితం మొత్తం మారిపోయింది. ఇండస్ట్రీలోకి రాకముందు నా జీవితంలో ఒక ఐదు సంవత్సరాలు నరకం అనుభవించాను. ఇప్పటికీ వాటి గురించి తలుచుకుంటే భయం పుడుతుంది. పదో తరగతి వరకు చదువుకున్న నేను ఈరోజు ఈ స్థాయిలో ఉంటానని ఎప్పుడు అనుకోలేదు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చిందని కొమరం చెప్పుకొచ్చాడు. ఇటీవల సినిమా అవకాశాలు ఎక్కువగా రావటంతో కామెడీ షోలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించాడు.