Comedian Mahesh: కొరియోగ్రాఫర్ చైతన్య మరణం వార్త అందరికి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.ఎంతో చలాకీగా ఉండే చైతన్య మాస్టర్ కేవలం ఆర్థిక సమస్యల కారణంగా ఎక్కువగా అప్పుల అవడం వల్లే తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మరి సూసైడ్ చేసుకున్నారు. ఇలా చైతన్య ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని మరణించడంతో ఆయన మరణం పట్ల ఎంతోమంది సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే రంగస్థలం మహేష్ సైతం కొరియోగ్రాఫర్ చైతన్య మరణ వార్త పై స్పందించారు.
ఈ సందర్భంగా మహేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చైతన్య మరణం గురించి మాట్లాడుతూ…చైతన్య మాస్టర్ తో కలిసి తాను కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో ట్రావెల్ చేశాను. ఆయన తనకు డాన్స్ కూడా నేర్పించారని మహేష్ తెలిపారు. అయితే చైతన్య మరణించే ముందు ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారో పాపం…ఆరోజు తాను చాలా బాధపడ్డానని అంత క్రేజ్ ఉన్నటువంటి తానే ఇలా సూసైడ్ చేసుకుంటే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి అని మహేష్ చైతన్య మరణం పై స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Comedian Mahesh:రవితేజ కామెడీ టైమింగ్ ఇష్టం…
ఇక రెమ్యూనరేషన్ గురించి కూడా మహేష్ మాట్లాడుతూ…తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తన రెమ్యూనరేషన్ చాలా తక్కువగానే ఉండేదని తెలిపారు.అయితే అవకాశాలు అందుకోవడం కోసం కెరియర్ మొదట్లో మనం రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకూడదని మనకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన అర్థం ఉంటుందని ఈ సందర్భంగా మహేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక హీరోల గురించి మాట్లాడుతూ కామెడీ టైమింగ్ విషయంలో తనకు రవితేజ అంటే చాలా ఇష్టమని, హీరోయిన్స్ విషయానికి వస్తే తనకు అనుష్క అంటే ఇష్టమని మహేష్ తెలిపారు.