Comedian Sunil: కమెడియన్ గా హీరోగా, విలన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు సునీల్ ఒకరు.సునీల్ కెరియర్ మొదట్లో కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు. అనంతరం ఈయన హీరోగా మారి పలు సినిమాలలో నటించిన హీరోగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి కమెడియన్ గా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఈయన విలన్ పాత్రలలో కూడా నటిస్తూ అందరిని భయపెడుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇకఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు ఎలాంటి గుర్తింపు వచ్చిందో అలాగే మంగళం శీను పాత్రలో నటించిన సునీల్ కి కూడా అదే గుర్తింపు లభించింది అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ సినిమాలో తనకు అవకాశం రావడం వెనక గల కారణాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సునీల్ ను యాంకర్ ప్రశ్నిస్తూ పుష్ప సినిమాలో మంగళం శీను క్యారెక్టర్ లో నటించారు. అసలు ఈ క్యారెక్టర్ చేయడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించారు.
Comedian Sunil: నీ బాడీని అన్ని విధాలుగా ఉపయోగించావు…
ఈ ప్రశ్నకు సునీల్ మాట్లాడుతూ తాను అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సుకుమార్ దగ్గరికి వెళ్లి తనకు ఏదైనా అవకాశాలు ఉంటే ఇవ్వమని అడిగాను ఆ సమయంలో ఆయన ఊహించని విధంగా సమాధానం చెప్పారు.ఇప్పటికే నీ బాడీని ఎన్ని విధాలుగా వాడాలో అలా వాడేసావు ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అని చెప్పారు. అయితే అప్పుడు కరోనా కావడంతో నా క్యారెక్టర్ స్కెచ్ పంపించారు ఆ స్కెచ్ ప్రకారం తాను రెడీ అయ్యి ఫోటోలు దిగి వారికి పంపించాను దీంతో తనకు మంగళం శీను పాత్ర చేసే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా సునీల్ మంగళం శీను క్యారెక్టర్ రావడం వెనుక ఉన్న కారణాలను ఎలా వచ్చింది అనే విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.