Comedian Venu:  ప్రస్తుతం ఇండస్ట్రీలో వందల కోట్లు ఖర్చు చేసి తీసే సినిమాలు మాత్రమే కాకుండా మంచి కథ ఉన్న చిన్న సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన బలగం సినిమా కూడా ఆ కోవకు చెందినదే..చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతోపాటు మంచి కలెక్షన్లు కూడా కొల్లగొడుతోంది. కమెడియన్ వేణు మొదటిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అయితే ఇప్పుడు ఇది దాదాపుగా 10 కోట్లు వసూలు చేసి సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంది.

ఎవరూ ఊహించని విధంగా ఘన విజయం అందుకున్న ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను ఇటీవల చిత్ర యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వేణు మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు, బాధలు గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ఈవెంట్ లో వేణు మాట్లాడుతూ..” సినిమా విజయం చాలా సంతోషాన్నిచ్చిందని, అంతకు ముందు ఒరేయ్‌ అని పిలిచే ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు గౌరవిస్తున్నారని, ఆ గౌరవం చూస్తుంటే భయంగా ఉందని తెలిపాడు. ఇది తనపై బాధ్యతని పెంచిందన్నారు.

Comedian Venu:  ఎవరు తనని నమ్మలేదు…

సినిమా విజయం సాధించటంతో జనం నన్ను చూసే కోణం మారిందని.. ఆ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నానని, ఆ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. కమెడియన్‌గా బ్రేక్‌ లేని బాధ నుంచి దర్శకుడు అవ్వాలనే కోరిక పుట్టిందని, తనని తాను నిరూపించుకోవాలనే ఆ కసి నుంచి `బలగం` సినిమా వచ్చిందని తెలిపాడు. తాను దర్శకుడిగా మారుతానంటే చాలా మంది ఎగతాళి చేశారని, తనని ఎవరూ నమ్మలేదని తెలిపాడు. కానీ తనని తాను నమ్మానని, ఆ నమ్మకంతోనే ముందుకు సాగానని సాగి దర్శకుడిగా నిలబడ్డానని వేణు ఎమోషనల్ అయ్యాడు.

Akashavani

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...