విమల మల్లిడి అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ శ్రీ రెడ్డి గా పరిచయమైన ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాల ద్వారా కంటే వివాదాల ద్వారానే ఎక్కువగా పాపులర్ అయింది. సినిమా పెద్దలని ఎదిరించి కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై పోరాటంతో ఈమె మరింత వెలుగులోకి వచ్చింది.
ఈమె పోరాటం ఎంతవరకు వెళ్లిందంటే ”మా” లో ఉన్న తొమ్మిది వందల మంది ఆమెతో నటించనని నిర్ణయాన్ని తీసుకున్నారు. అయినప్పటికీ జంకనటువంటి శ్రీ రెడ్డి తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది. సాక్షి టీవీలో యాంకర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన శ్రీరెడ్డి నేను నాన్న అబద్ధం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది.
సినీ పెద్దలకు సంబంధించిన చాటింగ్ లని, వీడియోలని పబ్లిక్ గా సోషల్ మీడియాలో ప్రదర్శించింది ఈ నటి. పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా విమర్శించడం వల్ల ఎన్నో ట్రోల్స్ కి గురవడంతో పాటు జనసేన కార్యకర్తలకు శత్రువు గా మారింది. పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఒక యూట్యూబ్ ఛానల్ ని పెట్టి అందులో రకరకాల ప్రాంతాల్లోని రకరకాల వంటలు చేసి చూపిస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె పంచుకున్న వీడియోలో పెళ్ళికి ముందే తల్లిని కాబోతున్నానంటూ చెప్పి షాక్ ఇచ్చింది శ్రీరెడ్డి. తీరా చూస్తే అది ఏప్రిల్ ఫూల్స్ చేయటం కోసం అంటూ సీక్రెట్ రివీల్ చేసింది. ఇందులో భాగంగా నెల్లూరులో ఉండే తన స్నేహితురాలు ప్రశాంతికి ఫోన్ చేసి నా బాయ్ ఫ్రెండ్ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఏం చేయటం అనటంతో నెల్లూరు వచ్చి కామ్ గా ప్రెగ్నెన్సీ తీయించుకోమని సలహా ఇచ్చింది ఆ స్నేహితురాలు. ఆఖరి నిమిషంలో ఇది ఫ్రాంక్ అని ఏప్రిల్ ఫూల్ చేయటం కోసమే ఇలా చేశానని చెప్పి ఆ స్నేహితురాలికి షాక్ ఇచ్చింది శ్రీరెడ్డి. అలాగే మరొక స్నేహితుడు శ్యామ్ కి కూడా ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్తే మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసిన ఆ స్నేహితుడు మళ్ళీ తిరిగి ఫోన్ చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.