Sai Pallavi: సాయి పల్లవి నటనకు గుడ్ బై చెప్పనుందా.. అసలు ఎందుకు ఈ నిశ్శబ్దం?

Akashavani

Sai Pallavi: సినీ లవర్స్ కి సాయి పల్లవి పేరు పెద్దగా పరిచయం లేదు. మలయాళం ప్రేమమ్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత ఫిదా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఫిదా చేసింది.

ఆ తరువాత ఈ అమ్మడు పలు స్టార్ హీరో ల సరసన నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది. ఇక ఇటీవలే అక్కినేని నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకుంది. ఈ సినిమా చక్కటి విజయాన్ని కూడా అందుకుంది.

ఆ తర్వాత నాని డబుల్ రోల్ చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ప్రశంసల వర్షంలో తడిసింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇదిలా ఉంటే ఈ భామ ప్రస్తుతం సినిమాల పరంగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. దాదాపు 2022 పూర్తయి నాలుగు నెలలు అయినప్పటికీ ఇంతవరకు మరో తెలుగు సినిమాలో నటించడానికి యాక్సెప్ట్ చేయలేదు. ఇది గమనించిన సాయి పల్లవి ఫ్యాన్స్ ఈ అమ్మడి సినిమాల విషయంలో ఏదైనా అప్ డేట్ ఇస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు.

Sai Pallavi: సాయి పల్లవి గురించి తన అభిమానులు ఈ విధంగా డౌట్ లు పడుతున్నారు!

ఇక పూర్తిగా సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై చెబుతుందా.. అసలు సాయి పల్లవి నిశ్శబ్దం గా ఉండడానికి గల కారణాలు ఏమిటని తన అభిమానులు అనేక డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సాయి పల్లవి.. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతుందో బ్యాడ్ న్యూస్ చెబుతుందో చూడాలి.

- Advertisement -