D.J Tillu: సిద్ధు జొన్నలగడ్డ ఈ పేరు చెబితే ఠక్కున గుర్తుపట్టలేక పోయినా డీజే టిల్లు అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తొస్తారు.సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఇదివరకే పలు సినిమాలలో నటించిన ఈయనకు పెద్దగా ఏది గుర్తింపు తీసుకు రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటించిన డీజే టిల్లు ఈ సినిమాతో ఒక్కసారిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న డీజే టిల్లు తనతో పాటు తన తల్లిని కూడా తీసుకొచ్చారు. ఎంతోమంది బుల్లితెర నటీనటులు మధ్య కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా స్టేజ్ పైన సిద్ధు జొన్నలగడ్డ తన తల్లి చేత దారుణంగా తిట్లు తిన్నారు.
ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరి వస్త్రధారణ విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రస్తుతం టామ్ జీన్స్ ధరించడానికి ఇష్టపడుతున్నారు.ఈక్రమంలోనే ఇలాంటి ప్యాంట్ ధరించిన సిద్దు జొన్నలగడ్డను చూపిస్తూ యాంకర్ ప్రదీప్ మీ అబ్బాయి ధరించిన ప్యాంటు చూస్తే మీకేమనిపిస్తుంది అంటూ హీరో తల్లిని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఆమె సమాధానం చెబుతూ ఈ కాలంలో పిల్లలు ధరించే వస్త్రధారణ గురించి మా జనరేషన్ వారికి ఎప్పటికీ అర్థం కాదని చెప్పారు. అప్పట్లో దుస్తులు చినిగి పోతే కుట్టుకొని మరి వేసుకునే వాళ్ళం అంటూ అవమానించారు.

D.J Tillu: డబ్బును వృధా చేస్తున్నారు…
అదే విధంగా ప్రస్తుత కాలంలో పిల్లలు చాలా మంది వారి డబ్బును వృధాగా ఖర్చు చేస్తున్నారు అంటూ ఈమె మాట్లాడారు. ఈ విధంగా సిద్దు జొన్నలగడ్డ తల్లి మాట్లాడటంతో ప్రదీప్ తిడుతున్నటున్నారు బయ్యా అని అనగా మరి ప్రతిరోజూ నాకు ఎలా ఉంటుందో తెలుసా అంటూ సిద్ధు జొన్నలగడ్డ ఈ సందర్భంగా తెలిపారు. ఈ విధంగా ఈ వేదికపై తన తల్లి సరదాగా తన కొడుకుని తిట్టడంతో అక్కడున్న వారందరూ కూడా ఎంతగానో నవ్వుకున్నారు.ఇక హీరో సిద్ధ జొన్నలగడ్డ విషయానికి వస్తే ఈయన ఇది వరకు పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. డీజే టిల్లు సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన అనంతరం ఆయనకు పలు అవకాశాలు క్యూ కట్టాయి.