Daggubhati Abhiram: దగ్గుబాటి అభిరామ్ పరిచయం అవసరం లేని పేరు. దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడిగా ఈయన అందరికీ సుపరిచితమే. ఇక అభిరామ్ ఇదివరకే అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇలా మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్నటువంటి ఈయన తదుపరి సినిమాను ప్రకటించక ముందే తన పెళ్లి విషయాన్ని ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. ఫిలిం ఇండస్ట్రీ ప్రకారం త్వరలోనే దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయని సమాచారం.
అభిరామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన రామానాయుడు తమ్ముడి మనవరాలిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు అంటూ వార్త చెక్కర్లు కొడుతుంది. ఇలా వరుసకు మరదలు అయ్యే అమ్మాయితో అభిరాం వివాహం చేయాలని ఇరువురి కుటుంబ సభ్యులు నిశ్చయించారట అయితే ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Daggubhati Abhiram: శ్రీ రెడ్డి స్పందన ఏంటో…
ఈ విధంగా అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న విషయం తెలియడంతో శ్రీరెడ్డి ప్రస్తావన మరోసారి వైరల్ గా మారింది గతంలో అభిరామ్ శ్రీ రెడ్డి గురించి ఎన్నో వార్తలో వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. శ్రీరెడ్డి కూడా అభిరామ్ తో చాలా చనువుగా ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.ఇలా వీరిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలియడంతో అభిరామ్ పెళ్లి చేసుకుంటే శ్రీ రెడ్డి పరిస్థితి ఏంటి ఆమె ఊరికే ఉంటుందా అంటూ కొందరు ఈ వార్తలపై కామెంట్లు చేస్తున్నారు. మరి అభిరామ్ పెళ్లి వార్తలపై శ్రీ రెడ్డి స్పందన ఏంటో తెలియాల్సి ఉంది.