Dancer Tina: ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ టీనా సాధు మరణించటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈమె గతంలో యాంకర్ ఓంకార్ ప్రారంభించిన డాన్స్ రియాల్టీ షో ఆటలో మొదటి సీజన్ లో పాల్గొని టైటిల్ విన్నర్ గా గెలిచింది. ఇక ఆ సమయంలో ఈమె మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.
ఆ తర్వాత సీజన్ ఫోర్ కి జడ్జిగా కూడా బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండగా గోవాకు చెందిన రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది. పెళ్లి తర్వాత పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈమె ఇటీవలే నాలుగైదు రోజుల క్రితం గోవా నుండి హైదరాబాద్ కు వచ్చి అక్కడ యాంకర్ శిల్పా చక్రవర్తిని కలిసిందని పైగా తిరిగి డాన్స్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని ఉందని తెలిపిందట.

Dancer Tina: ఆమె చనిపోవడానికి కారణం అదే..
ఆ తర్వాత ఆమె గోవా కి వెళ్లిపోయిందని.. ఇక అక్కడ ఆమె తన ఇంట్లో ఉన్న సమయంలో మద్యం సేవించింది అని తెలిసింది. పైగా ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని తెలిసింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఆమె చనిపోవడంతో ఆమె అభిమానులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఆమె ఈ లోకాన్ని విడిచిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆమె చివరిసారిగా తన ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్న వీడియోలను చూసి నెటిజన్లు బాగా ఎమోషన్ అవుతున్నారు.