Dasara Director: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా దసరా సినిమా గురించే వినిపిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే శ్రీకాంత్ దర్శకుడిగా తన ప్రతిబని నిరూపించుకున్నాడు. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకు మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది . నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలిచింది. సినిమా విడుదలైన రెండు రోజులలోనే రూ. 53 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు సైతం సినిమా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కూడా ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించాడు. ఇటీవల సినిమా చూసిన మహేష్ బాబు స్పందిస్తూ దసరా ఒక అద్భుతమైన సినిమా అంటూ ట్వీట్ చేశాడు. దీంతో దసరా యూనిట్ మొత్తం సంతోషం వ్యక్తం చేశారు. మహేష్ బాబు లాంటి ఒకసారి హీరో సినిమా చూసి సినిమా గురించి ప్రశంసించడం ఒక గొప్ప విషయం అంటూ వెల్లడించారు. శ్రీకాంత్ ఓదెల మొదటిసారిగా దసరా సినిమాకు దర్శకత్వం వహించాడు. మొదటి సినిమానే ఇంత మంచి విజయం సాధించడంతో శ్రీకాంత్ కి మంచి అవకాశాలు వస్తాయని అందరూ భావిస్తున్నారు.
Dasara Director: మహేష్ బాబుతో దసరా డైరెక్టర్…
ఈ క్రమంలో ఇండస్ట్రీ వర్గాలనుండి ఒక వార్త వినిపిస్తోంది. దసరా సినిమా హిట్ అవ్వటంతో శ్రీకాంత్ కి ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశం దక్కినట్లు సమాచారం. దసరా సినిమా తెరకెక్కించటంలో శ్రీకాంత్ చూపిన ప్రతిభ మహేష్ బాబుని బాగా ఆకట్టుకుందని, అందువల్ల శ్రీకాంత్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలో నటించనున్నాడు . ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత శ్రీకాంత్ దర్శకత్వంలో నటించటానికి మహేష్ బాబు అంగీకరించినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే శ్రీకాంత్ స్పందించాల్సి ఉంటుంది.