Dasara Movie: నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 30 నవ తేదీన విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నాని కీర్తి సురేష్ నటించిన సినీ విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించాడు. దీంతో అతని దర్శకత్వ ప్రతిభ గురించి పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు దసరా సినిమా గురించి ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమా గురించి ప్రశంసిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా దసరా చిత్ర బంధం పై ప్రశంసలు కురిపించాడు. ఇటీవల దసరా సినిమా చూసిన ప్రభాస్ దర్శకుడు నటీనటుల మీద ప్రశంసలు కురిపిస్తు పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ” ఇప్పుడే దసరా సినిమా చూశా.. ఇది అద్భుతమైన చిత్రం.. నాకు బాగా నచ్చింది. ఇలాంటి చిత్రం చేసినందుకు నానికి కంగ్రాట్స్ చెబుతూ అభినందిస్తున్నా. మనం ఇలాంటి చిత్రాలు మరిన్ని చేయాలి అంటూ నాని, కీర్తి సురేష్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి శుభాకాంక్షలు చెబుతూ ..ప్రభాస్ పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
Dasara Movie: భారీ క్రేజ్ సొంతం చేసుకున్న నాని…
అయితే ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా హీరో సినిమా చూసి సినిమా మీద ప్రశంసలు కురిపించడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రభాస్ లాంటి గొప్ప హీరో సినిమా గురించి గొప్పగా చెప్పటం కంటే గొప్ప రివ్యూ ఏం ఉంటుంది అంటూ సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దసరా సినిమా విడుదలైన మొదటి రోజు నుండి ఇప్పటివరకు మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తూ నాని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.