Dasara Movie: నాని కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన రెండు రోజులలో రూ. 53 కోట్లు కొల్లగొట్టి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు, తమిళ్, హిందీ కన్నడ, మలయాళం భాషలలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అంగన్‌వాడి టీచర్ల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని అంగన్‌వాడిలు ఆందోళనకు దిగారు.సమాజానికి ఎంతో సేవ చేస్తోన్న అంగన్‌వాడి టీచర్లను దొంగలుగా చిత్రీకరించారని అంగన్‌వాడి టీచర్లు ఆవేదన వ్యక్తంచేశారు. తమ వృత్తిని కించపరిచేలా చిత్ర నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు తమను అవమానించారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దసరా మూవీని ప్రదర్శిస్తున్న థియోటర్ల ఎదుట అందోళన చేపట్టారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అంగన్ వాడీ టీచర్లు.. సినిమాలో తమని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
Dasara Movie: వివాదంలో చిక్కుకున్న దసరా సినిమా…
ఆ సన్నివేశాలు తొలగించకపోతే.. రాబోయే రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని స్పష్టంచేశారు. ఈ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. అంగన్వాడీ టీచర్ల డిమాండ్ బట్టి సన్నివేశాలు తొలగిస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉండగా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో విడుదలైన మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దసరా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అత్యధిక వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాపై అంగన్వాడీల నిరసన ప్రభావం చూపుతుందో లేదో చూడాలి మరి.