Dasara Movie: మార్చి 30న రిలీజ్ అయిన దసరా సినిమా థియేటర్లలో దుమ్ము రేపుతుంది. ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరూ ఈ సినీ దర్శకుడికి ఇదే మొదటి సినిమా అనుకోరు. నాని ఊర మాస్ క్యారెక్టర్ లో జీవించాడనే చెప్పాలి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు సంతోష్ నారాయణ సంగీతం సమకూర్చారు.
ఇందులో నాని, కీర్తి సురేష్ లతో పాటు దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సాయికుమార్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ భాషల్లో విడుదల చేశారు బొగ్గుతో నిండిన కు గ్రామం వీర్లపల్లి లో జరిగిన సెమీ ఫిక్షన్ కథలో కుల రాజకీయాలను అన్వేషించే మాస్ మూవీ ఈ దసరా.
ఈ సినిమా ఊహించని రీతిలో తక్కువ సమయంలోనే 100 కోట్ల గ్రాస్ కి చేరువలో ఉంది దసరా. అయితే ఈ సినిమా మంచి లాభాలను తీసుకురావడంతో నిర్మాత అయినా సుధాకర్ చెరుకూరి మంచి ఆనందంలో ఉన్నారట. ఇదే ఆనందంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కి 80 లక్షల రూపాయల విలువచేసే బీఎండబ్ల్యూ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడంట.
దాంతోపాటు మిగతా ఇంపార్టెంట్ టెక్నీషియన్స్ అందరికీ 10 గ్రాముల విలువచేసే గోల్డ్ కాయిన్ ని ప్రెసెంట్ చేశాడంట. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల మంచి జోష్ మీద ఉన్నట్టు తెలుస్తుంది అప్పుడే ఆయన తర్వాత సినిమా మహేష్ బాబు తో ఉండబోతున్నట్లుగా తెలిసింది. అది ఎంతవరకు నిజమన్నది శ్రీకాంతే చెప్పాలి. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి.
Dasara Movie:
ఈ సినిమాలో నిజంగానే నాని తన విశ్వరూపాన్ని చూపించి నాచురల్ స్టార్ అని మరొకసారి నిరూపించుకున్నాడు. అలాగే కీర్తి సురేష్ తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో మరొకసారి చూపించింది. ఇక సముద్రఖని, సాయికుమార్ల నటన గురించి మనం మాట్లాడుకో అక్కర్లేదు. వీరందరి నటనతో సినిమాని మరో రేంజ్ కి తీసుకెళ్లారని చెప్పొచ్చు.