Devatha April 29 Episode: కూతురిని వద్దనుకున్న ఆదిత్య.. సంతోషంలో దేవి!

Akashavani

Devatha April 29 Episode: ఈ రోజు ఎపిసోడ్ లో దేవి కోసం రాధ, ఆదిత్య వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇక ఎదురుగా ఒక తల్లి కూతుర్లు సరదాగా ఆడుకుంటూ వెళ్లగా.. ఆ సమయంలో రాధా దేవి ని గుర్తు చేసుకొని గతంలో తము మాట్లాడిన మాటలను తలుచుకుంటుంది. అక్కడ ఉన్న స్థలం తనకు నచ్చేదని.. అందుకే ఎప్పుడూ ఇక్కడే వచ్చి కూర్చుంటాను అని దేవి తో మాట్లాడిన మాటలను గుర్తుకు చేసుకుంటుంది. ఇక వెంటనే రాధ తేరుకొని దేవమ్మ ఎక్కడ ఉందో నాకు తెలుసు అంటూ ఆదిత్యను తీసుకెళ్తుంది.

సీన్ కట్ చేస్తే..

ఇంట్లో చిన్నయి దేవి కోసం తెగ తాపత్రయ పడుతుంది. తన తాతయ్య వాళ్ళ తో దేవి గురించి పదే పదే అడుగుతుంది. దేవి కోసం తనను ఇక్కడే ఉంచి అమ్మ ఒక్కతే వెళ్ళిపోయింది అని రామమూర్తి వాళ్ళతో చెబుతుంది. చెల్లె ఎక్కడికి వెళ్ళినా నాతో చెబుతుంది అంటూ చిన్మయి బాధపడుతూ ఉంటుంది. ఇక రామమూర్తి బలవంతంగా ఒకరికి ఇవ్వాలనడంతో తట్టుకోలేక ఎక్కడికైనా వెళ్ళి పోయిందేమో అన్నట్లుగా మాట్లాడుతాడు.

దొరికిన దేవి..

ఇక రాధ అనుకున్నట్లుగా దేవి తను ఊహించిన ప్లేస్ లోనే ఉంటుంది. వెంటనే దేవి దగ్గరికి వెళ్లి.. బిడ్డ అంటూ ఎమోషనల్ అవుతుంది. బాగా ఏడుస్తుంది. ఇలా ఎందుకు చేశావమ్మా అంటూ అని అడుగుతుంది. నా కష్టం గురించి ఇక్కడ దేవుడితో చెప్పుకోడానికి వచ్చాను అని అంటుంది. దాంతో ఏం కష్టం అని రాధ అడగటంతో.. నిన్ను వదిలి వెళ్లే ఇష్టం లేక ఇక్కడ దేవుడితో చెప్పుకోడానికి వచ్చాను అంటూ బాధ పడుతుంది.

దేవిని వదులుకున్న ఆదిత్య..

పక్కనే ఉన్న ఆదిత్య కూడా బాధ పడుతూ ఉంటాడు. ఇక రాధ.. దేవితో ఆదిత్య గురించి నిజం చెప్పబోతుంటగా వెంటనే ఆదిత్య రాధను ఆపుతాడు. అసలు నిజం చెప్పకుండా చేస్తాడు. ఇక రాధ ఆశ్చర్యపోతూ ఉండగా.. నేను దేవిని దత్తత తీసుకోను అనడంతో రాధా షాక్ అవుతుంది. దేవి మాత్రం సంతోషపడుతుంది. తన వల్ల దేవి పరిస్థితి ఇక్కడికి వచ్చిందన్న ఉద్దేశంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది.

Devatha April 29 Episode: సంతోషంలో దేవి..

అంతేకాకుండా దేవి ని దగ్గరికి తీసుకొని మీ అమ్మ తోనే ఉండు అని అనడంతో దేవి సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎప్పటిలాగే మనం ఫ్రెండ్స్ లా ఉందాం అని ఆదిత్య దేవితో అంటాడు. దానికి దేవి సంతోషంగా సరే అంటుంది. ఇక రాధ దేవితో నిన్ను వదిలి ఉండలేను అంటూ ఎమోషనల్ అవుతుంది. ఆ సమయంలో అక్కడికి మాధవ వచ్చి దేవి ని పట్టుకొని దగ్గరకు తీసుకుంటాడు.

దేవి కనిపించటంతో సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇక దేవి.. ఆ ఆఫీసర్ సారు నన్ను దత్తత తీసుకోనని అన్నాడని అనడంతో.. అడిగిన ఇచ్చే వాళ్ళు ఇక్కడ లేరు అని అక్కడినుంచి దేవి ని తీసుకొని వెళ్తాడు. రాధ కూడా మరో మాట అనకుండా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆదిత్య మాత్రం కూతుర్ని దూరం చేసుకున్నందుకు బాగా ఎమోషనల్ అవుతాడు.

- Advertisement -