Devatha April 30 Episode: రాధను వదిలిపెట్టని మాధవ.. తప్పు తెలుసుకున్న రుక్మిణి!

Akashavani

Devatha April 30 Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇంట్లో దేవి లేకపోవడంతో చిన్మయి, రామమూర్తి దంపతులు బాధపడుతూ ఉంటారు. అప్పుడే మాధవ, రాధ దేవిని ఇంట్లోకి తీసుకొని రావడంతో అది చూసిన చిన్మయి తెగ సంతోషపడుతుంది. ఇక చిన్మయి దేవి దగ్గరికి వెళ్లి బాగా ఎమోషనల్ అవుతుంది. నేను నిన్ను ఏమైనా అన్నానా.. నాకు చెప్పకుండా నన్ను వదిలి ఎక్కడికి వెళ్లావు అంటూ బాధపడుతుంది.

దేవి ని పట్టుకొని ఎమోషనల్ అయిన చిన్మయి..

దాంతో దేవి.. ఇకపై ఎక్కడికి వెళ్ళను అని.. నీకు చెప్పకుండా అస్సలు వెళ్ళను అని అంటుంది. ఇక చిన్మయి.. ఒకవేళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కూడా నీతో వస్తాను అని మాట ఇస్తుంది. రామమూర్తి కూడా దేవితో మాట్లాడుతూ ఎమోషనల్ అవుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము తట్టుకోలేము అని అంటాడు. ఇక జానకి పిల్లలిద్దర్నీ అక్కడినుంచి పంపిస్తుంది.

రామమూర్తి దంపతులకు శుభవార్త చెప్పిన రాధ.

దేవికి అలా జరగటంతో రామమూర్తి దంపతులు రాధతో నువ్వు దేవికి కష్టం అయ్యావు అంటూ అంటుంటారు. వెంటనే రాధ.. దేవి ఇకపై ఎక్కడికి వెళ్ళద్దు అని ఆ ఆఫీసర్ సారు తనని దత్తత తీసుకొని అన్నాడు అని చెబుతుంది. ఇకపై దేవి మనతోనే ఇక్కడే ఉంటుంది అనడంతో రామమూర్తి దంపతులు సంతోష పడతారు. ఇక ఆదిత్య ఈ నిర్ణయం తీసుకోవటంతో రామమూర్తి దంపతులు ఆదిత్య ను పొగుడుతారు.

తల్లిదండ్రుల పై కోపంతో రగిలిపోయిన మాధవ..

ఇక ఆదిత్యను పొగడడం చూసిన మాధవ రామమూర్తి దంపతులపై కోపంతో రగిలి పోతూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత రాధ ఓ చోట కూర్చుని ఆదిత్య మాట్లాడిన మాటలను తలచుకుంటుంది. తన భర్త దేవి విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని ఆలోచిస్తుంది. అంతే కాకుండా తన చెల్లికి పిల్లలు పుట్టక.. తను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చివారికి బాధ పెట్టి తప్పు చేశాను అని బాధపడుతుంది.

Devatha April 30 Episode: దేవి దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అయిన మాధవ..

ఇక చిన్మయి నిద్రలో ఉన్న దేవిని నిమురుతూ ఉండగా అక్కడికి రాధ వచ్చి చూస్తుంది. పైగా మాధవ కూడా వచ్చి దేవి దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతుండటంతో వెంటనే దేవి నిద్ర నుంచి లేచి మాధవను బాధపడవద్దు అని చెబుతుంది. నన్ను ఏడిపిస్తున్నావు అని.. మీ అమ్మ వెళ్ళమన్నది కానీ నేను వెళ్లమ్మని అన్నానా అంటూ.. నన్ను ఎలా వదిలి వెళ్ళిపోయావు అని బాధ పడతాడు. ఇక రాధతో ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడమని అంటాడు.

మరుసటి రోజు ఉదయాన్నే రాధ దగ్గరకు రామమూర్తి దంపతులు వచ్చి ఆదిత్య కు దత్తత ఇవ్వడానికి ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతారు. అంతేకాకుండా ఆదిత్య నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. అప్పుడే అక్కడికి మాధవ వస్తాడు. తరువాయి భాగంలో మాధవ రాధతో.. ఆదిత్య మీద ఉన్న ప్రేమతో ఇలా చేస్తున్నావా అంటూ ఇవాళ దేవి ని అడిగినవాడు.. రేపు నిన్ను కూడా అడుగుతాడు అని అంటాడు. మొత్తానికి మాధవ రాధ ను తన సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంటాడు.

- Advertisement -