Devatha January 5 Episode: దేవత నేటి ఎపిసోడ్, సుహాసిని అర్జున్ లు జంటగా నటిస్తున్న సీరియల్ దేవత. ఈ సీరియల్ మన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ముఖ్యంగా రుక్మిణీ – ఆదిత్యల ప్రేమకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు ఇక ఈ సీరియల్లో ఈ రోజు అంటే జనవరి 5 వ రోజున జరగబోయే సన్నివేశాల్ని మనం ఇప్పుడే చూసేద్దాం రండి!
ఇక ఈ రోజటి ఎపిసోడ్ లో…..
ఎపిసోడ్ మొదలవగానే…. సూరి పేకాట ఆడటానికి బయటికి వెళ్లడానికి రెడీ అవుతాడు. అప్పుడే రాజమ్మ టీ తెచ్చి ఇస్తుంటే వద్దు రాజమ్మ అని త్వరత్వరగా వెళ్తుంటాడు సూరి. ఇక కోపంగా రాజమ్మ నా కంటే అదే బాగుంటుందా ? నా కంటే అదే బాగా రెడీ అవుతుందా ? అని అనుమానంగా చూస్తోంది రాజమ్మ. ఎవరే ఎవరు రెడీ అవుతారు అని సూరి అడిగితే అలిగినట్టుగా వెళ్లిపోతుంది రాజమ్మ.
ఏంటో నా పెళ్ళాం అమాయకురాలు అనుకుంటే ఇది కూడా అనుమానిస్తుంది అనుకుంటూ వెళ్తుండగా దేవుడమ్మ వచ్చి సూరి రామ్మూర్తి వాళ్ళ ఊర్లో బంగారం బాగా మెరుగుపడతారట వెళ్లి కాస్త ఈ పని చేసిపెట్టవా అని అడుగుతుంది దేవుడమ్మ.
సూరిని ఇరికించేసిన భాషా:
ఇక పేకాటకి లేట్ అవుతుందని సూరి అబ్బో!…. అమ్మో!…. ఈ నడుమునొప్పి… హయ్యా!… హమ్మ!…. అంటూ నొప్పితో బాధ పడుతున్నట్లు నటిస్తాడు. అప్పుడే అక్కడికి వస్తాడు భాషా. భాషని ఇరికిద్దామని చూస్తాడు సూరి కాని భాషాకి కమలని హాస్పిటల్కి తీసుకువెళ్ళే పని ఉంటుంది. సరేలే సూరి ఈ రోజు నీకు నడుము నొప్పి కదా రేపు వళ్దువులే అని లోపలికి వెళ్తుంది దేవుడమ్మ.
పటేలా నీ పేకాట దోస్తులు నీకోసం బయట ఎదురుచూస్తుండ్రు జల్ది పో సారు అని భాషా అనగానే అవునా వాళ్లు ఏకంగా ఇంటికి వచ్చారా అని కంగారుగా చక చకా నడుచుకుంటూ వెళ్తాడు సూరి. అమ్మ పటేల్ కి నడుము నొప్పి తక్కువ అయింది ఆ బంగారం ఇటు ఇయీ…. అని సూరిని ఇరికిస్తాడు భాషా. ఇక ఏ దారి దొరక్క సరే వదినా అంటూ రామ్మూర్తి వాళ్ళ ఊర్లోకి వెళ్తాడు సూరి.
అప్పుడే స్కూల్ బయట వెయిట్ చేస్తుంటారు దేవీ చిన్మయి. దేవి చిన్మయి ని చూసి సూరి ఈ పిల్లలు ఏంటి ఈ ? ఓహో!.. స్కూల్ అయిపోయింది కదా వాళ్ళ అమ్మ నాన్న కోసం వెయిట్ చేస్తున్నారేమో అయినా మనం అక్కడికి వెళితే నన్ను ఇంటికి తీసుకెళ్లమంటారు వద్దులే అని చూస్తుండగా కార్ వచ్చి అక్కడ ఆగుతుంది. కార్ లో నుంచి రాధ దిగుతుంది. దేవి వాళ్ళ అమ్మ ఈవిడే కావచ్చు కనిపించట్లేదు ఏంటి అని చూస్తుండగా రాధ సూరి వైపు తిరుగుతుంది.
రుక్మిణిని చూసి సూరి అవుట్!
ఇక సూరి షాక్!…. దేవి వాళ్ళ అమ్మను చూసి రుక్మిణీ! రుక్మిణి…… అని షాకయి అరుస్తుంటాడు. రాధ పిల్లలని కార్లో ఎక్కించుకుని వెళ్తుంది. ఇక ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పాలని తొందరగా పరిగెత్తుతూ వెళ్తాడు సూరి.
ఇక గేటు దాటి ఇంట్లోకి వెళ్ళగానే ఆదిత్య కనిపిస్తాడు. బాబాయ్ ఏంటి ఇంత హడావిడిగా పరిగెడుతున్నాడు ఏమైందని ఆదిత్య సూరి వెనకాలే వెళ్లి సూరిని బయటికి లాక్కొని వస్తాడు.
ఏమైంది బాబాయ్ అని అడగగానే రుక్మిణిని నా కళ్ళారా నేను చూశాను మన రుక్మిణి బ్రతికే ఉంది జరుగురా త్వరగా వెళ్లి వదినకి చెప్పాలి అయినా నువ్వు సత్య 24 గంటలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు గా మన రుక్మిణిని చూసే ఉంటారుగా అని అంటాడు సూరి. అవును బాబాయ్ మేము కూడా మొదట తనని చూసి రుక్మిణి అని అనుకున్నాము కానీ తరువాత తెలిసింది తను రాధ అని బాబాయ్ నువ్వు వెళ్లి ఇప్పుడు అమ్మకి నాన్నకి చెబితే రాధ జీవితం నాశనం అవుతుంది. రాధా ఒక అనాధ ఇప్పుడు మనం వెళ్లి తాను మా రుక్మిణి నా భార్య అని చెబితే అదే ఆ మాధవ్ ఊరుకుంటాడా అనుమానంతో రాధని ఏం చేస్తాడో అర్థం చేసుకో బాబాయ్ తన జీవితం ఏమైపోతుందో అని సూరిని నిజం చెప్పకుండా బయటే ఆపేస్తాడు ఆదిత్య. ఇక ఇంతటితో ముగుస్తుంది ఇవాల్టి ఎపిసోడ్.
ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడే తెలుసుకుందాం! దేవత కొనసాగుతుంది….