Devatha January 7 Episode: దేవత నేటి ఎపిసోడ్, సుహాసిని అర్జున్ లు జంటగా నటిస్తున్న సీరియల్ దేవత. ఈ సీరియల్ మన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ముఖ్యంగా రుక్మిణీ – ఆదిత్యల ప్రేమకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు ఇక ఈ సీరియల్ లో ఈ రోజు అంటే జనవరి 7 వ రోజున జరగబోయే సన్నివేశాల్ని మనం ఇప్పుడే చూసేద్దాం…. రండి!
ఇక ఈ రోజటి ఎపిసోడ్ లో…..
సత్య ఇచ్చిన గిఫ్ట్ తీసుకొచ్చి రాధకి ఇస్తాడు మాధవ్…. గిఫ్ట్ చూసి రాధ షాక్ అవుతుంది. ఏంది సారు గిది అని అడుగుతుంది కోపంగా… రాధాకృష్ణులు బొమ్మ రోజు నువ్వు పూజ చేసుకుంటావ్ కదా అందుకని తెచ్చాను అని చెప్తాడు మాధవ్. రాధా కోపంగా చూస్తోంది…. రాధ నీకు ఇష్టమైతే దేవుడి గదిలో పెట్టు లేదంటే నీ గదిలో పెట్టుకో అని చెప్తాడు మాధవ్.

రాధా కోపంగా రాధాకృష్ణల బొమ్మని తీసుకెళ్లి హాల్లో పెడుతుంది. రాధ అలా పెట్టడం చూసిన మాధవ్ ఏంటి రాధా ఇలా ఇక్కడ పెట్టావ్ అని అడుగుతాడు. సారు గిిది ఎందుకు ఇస్తారో తెలుసు తెల్వనంత పిచ్చిదాన్ని కాదు ఈ బొమ్మకు అర్థం రాధాకృష్ణల మధ్య ప్రేమ కానీ సారు గుర్తుపెట్టుుకోండ్రి రాధాకృష్ణల మధ్య ప్రేమ ఉంది గాని వాళ్ళిద్దరు ఎప్పుడూ కలవలేదు గది గుర్తుపెట్టుకోండి నేను సచ్చేదాకా నా మనసులో నా పెెనిమిటే ఉంటడు అని చెప్పి వెళ్లిపోతుంది రాధ.
అప్పుడే వస్తుంది సత్య. వచ్చి బావా!…. బావా!… అంటూ పిలుస్తుంది. బాధగా వస్తాడు మాధవ్ ఏంటి బావ ఏమైంది ? మన ప్లాన్ వర్కవుట్ అయిందిగా అక్కకి గిఫ్ట్ ఇచ్చావా ? అని అడుగుతుంది సత్య. ఇచ్చాను అంటాడు మాధవ్ ఏమైంది బావ ఏమంది అక్క అని అడగగానే ఫ్లాప్ అయింది అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని చెప్పి వెళ్ళిపోతాడు మాధవ్. పాపం బావ బాధపడుతున్నట్టున్నాడు అని అనుకుంటుంది సత్య. సత్య మాధవ్లు మాట్లాడుకోవడం రాధ చూస్తూ ఉంటుంది ఇదంతా సత్య చేసిందా దీనికి అసలు దిమాక్ లేకుండా పోతోంది అని అనుకుంటూ వెళుతుంది రాధ.

సత్య అక్కా… అంటూ వెళ్లి రాధని గాట్టిగా పట్టుకుంటుంది. అక్క నీకు ఒక గుడ్ న్యూస్ నువ్వు పెద్దమ్మవి కాబోతున్నావ్ అని చెప్పగానే రాధ సత్యని గట్టిగా హత్తుకొని అవునా అని సంబరపడుతుంది. సత్య చాలా సంతోషిస్తుంది వెంటనే రాధ సత్యని దూరంగా పెట్టి సరే మంచిది అంటుంది ఏంటి అక్క ఇలా అంటుంది అనే సందేహంలో పడిపోతుంది సత్య.
సత్య దేవి చిన్మయి లను తీసుకొని ఆదిత్య తో బొమ్మల షాప్ కి తీసుకెళ్తుంది. ఏంటి సత్య ఈ షాప్ కి తీసుకొచ్చావ్ అని అడుగుతాడు ఆదిత్య. మనకి పుట్టబోయే బిడ్డ కోసం ఆదిత్య అంటూ లోపలికి వెళ్తుంది సత్య..

చిన్నమ్మ మమ్మల్ని గి బొమ్మల షాప్ కి తీసుకొచ్చినవ్ మేము బొమ్మలు కొనుక్కోవడం కోసమా ?… అని దేవి అడగగానే మీ చెల్లి కోసం దేవి నా కడుపులో బుజ్జి పాప ఉంది అని చెప్తుంది సత్య. అవునా మాకు చెల్లి పుడుతుందా అయితే చెల్లికి బొమ్మలు మేమే సెలెక్ట్ చేస్తాం అంటూ బొమ్మలు తీసుకుంటారు దేవి చిన్మయి.
ఇక దేవి చిన్మయి లని ఇంట్లో దింపి సత్య ఆదిత్య ఇంటికి వెళ్తారు. ఏంటి సత్య బొమ్మల కొలుువే తీసుకొచ్చినట్టున్నావ్ అని అడుగుతుంది దేవుడమ్మ ? అవును ఆంటీ మీ మనవరాలికి కోసం అంటుంది సత్య. లేదు లేదు నాకు మనవడే కావాలి అని అంటుంది దేవుడమ్మ. దేవుడమ్మ మీ ప్రేమ చూస్తుంటే నేను చనిపోయి వీళ్ళ కడుపులో బిడ్డగా పుట్టాలని అనిపిస్తుంది అని అంటాడు ఈశ్వర్ ప్రసాద్ వెంటనే అందరూ షాక్ అయి చూస్తారు. ఇక ఇంతటితో ముగుస్తుంది ఇవాల్టి ఎపిసోడ్.
ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడే తెలుసుకుందాం! దేవత కొనసాగుతుంది…..