Devatha July 15 Today Episode: ఈ రోజు ఎపిసోడ్ లో భాగ్యమ్మ రుక్మిణిని గుడిలో ఎవరు గుర్తుపట్టకూడదు అని అక్కడున్న అమ్మవారి దగ్గర పసుపు ముఖానికి పెడుతుంది. ఆ తర్వాత బొట్టు పెట్టి ఇప్పుడు వెళ్ళు అని ధైర్యం ఇస్తుంది. వెళ్లి నా బిడ్డని నా పెనిమిటికి దగ్గరికి చెయ్యు అని.. నా జీవితం లాగా తన జీవితం కాకూడదు అని అమ్మవారికి కోరుకోమని భాగ్యమ్మ సలహా ఇస్తుంది.
సీన్ కట్ చేస్తే..
గుడిలో అక్కడున్న ఒక ఆవిడ అందరికీ బోనం దింపుతూ ఉంటుంది. ఇక దేవుడమ్మ బోనం దింపుతున్న సమయంలో అప్పుడే అక్కడ ఉన్న ఒక ఆవిడకు అమ్మవారు పూనుకుంటుంది. ఇక అమ్మవారు దేవుడమ్మ దగ్గరికి వచ్చి నీ మనసులో ఒక కోరిక ఉంది నా కోరిక తీరాలి అని బోనం చేశావు అని అనటంతో దేవుడమ్మ అవును అని అంటుంది.
దేవుడమ్మకు సలహా ఇచ్చిన అమ్మవారు..
ఒకరి కోసం ఎదురు చూస్తున్నావు.. త్వరలో నీ దగ్గరికి వస్తారు అని.. నీ కళ్ళ ఎదుట ఉన్న కూడా నువ్వు కనిపెట్టలేక పోతున్నావు అని అంటుంది. వెంటనే దేవుడమ్మ అవును నా కోడలు కోసం చూస్తున్నాను అనటంతో.. వస్తుంది.. అడుగు పెట్టింది.. కనిపెట్టు అంటూ సలహా ఇచ్చి అమ్మవారు ఆవిడ ఒంట్లోకి ఇంచి వెళ్లిపోతుంది.
రుక్మిణి అక్కడున్న అమ్మవారి దగ్గర ఎదురుగా నుంచొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఎందుకు తనకు ఇలా అవుతుంది అని బాధపడుతుంది. ఇక ఆ తర్వాత గుడికి వస్తుంది. అదంతా దూరంగా భాగ్యమ్మ గమనిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆదిత్య బయట ఒంటరిగా కూర్చుని దేవుడమ్మకు చెప్పిన అమ్మవారి మాటలు గుర్తుకు వస్తాయి.
కూతురు ముందు నోరు జారిన ఆదిత్య..
అప్పుడే అక్కడికి దేవి వచ్చి అమ్మవారిని ఏం కోరుకున్నావు అని అనడంతో.. నువ్వు బాగుండాలి అని మీ అమ్మ బాగుండాలి అని మొక్కాను అంటాడు. దాంతో దేవి మా అమ్మ గురించి ఎందుకు మొక్కావు అని ఆశ్చర్యపోగా.. తల్లి బాగుంటే బిడ్డ బాగుంటుంది కదా అని సరిదిద్దుతాడు. ఇక వీరి మాటలు మాధవ వింటూ.. నా కూతుర్ని ఆదిత్య దగ్గరికి చేసుకుంటున్నాడు అని కోపంతో రగిలిపోతాడు.
Devatha July 15 Today Episode: రుక్మిణిని చూసిన దేవుడమ్మ..
ఇక రుక్మిణి అమ్మవారి దగ్గర బోనం సమర్పిస్తూ ఉండగా దేవుడమ్మ వచ్చి.. ఆగు అంటూ.. నువ్వేం చేస్తున్నావు అంటూ గట్టిగా నిలదీసినట్లు మాట్లాడుతుంది. దాంతో రుక్మిణి గుర్తుపట్టిందేమో అని భయపడుతుంది. కానీ దేవుడమ్మ బోనం దించేటప్పుడు మరొకరు ఉండాలి అని ఆ తర్వాత వారి కాళ్లకు నమస్కరించుకోవాలని చెబుతుంది.
దేవి గురించి ఎమోషనల్ గా మాట్లాడుతున్న మాధవ..
దాంతో దేవుడమ్మ రుక్మిణి బోనం దింపగా.. రుక్మిణి దేవుడమ్మ కాళ్ళకు దండం పెట్టుకుంటుంది. కానీ దేవుడమ్మ తన కోడల్ని గుర్తుపట్టలేక పోతుంది. మరోవైపు భాష, కమల రుక్మిణి బతికే ఉందన్న విషయాన్ని పంచుకుంటారు. ఇక మాధవ సత్య రావడానికి గమనించి చిన్మయితో దేవి గురించి ఎమోషనల్ గా మాట్లాడుతున్నట్టు నటిస్తాడు. ఆ మాటలు విన్న సత్య దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తుంది. ఇక దేవి కాస్త బాధ పడినట్లు కనిపిస్తుంది.