Devatha July 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మాధవ దేవిని ఇంటికి రప్పించుకునే విధంగా ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేస్తాడు. సత్య మాధవ దగ్గరికి వచ్చి ఏం జరిగింది అనటంతో.. మాధవ తన కూతురు దేవి లేకుంటే రాధ రాలేదు అంటూ.. నా కూతురు నా ఇంట్లో ఎత్తుకోవాల్సిన బోనం మీ ఇంట్లో ఎత్తుకుంది. నాకు కూడా నా కూతురికి అన్ని చేయాలని ఉంటుంది కదా అంటూ ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తాడు.
అంతేకాకుండా దేవిని ఇంటికి రమ్మని నేను వెళ్తే దేవి రాలేకపోయింది అని.. మరేవరితో పిలిచిన కూడా దేవి రాలేదు అంటూ.. బాధపడుతున్నట్లు కనిపిస్తాడు. ఇక ఆ మాటలన్నీ దేవి ఒకచోట ఉండి వింటూ బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక మాధవ సత్యతో ఒక హెల్ప్ చేయమని.. తన కూతురిని తన ఇంటికి పంపించేలా చేయమని అనటంతో.. అలా ఎందుకంటారు.. తను మీ కూతురే కదా పంపిస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది.
సీన్ కట్ చేస్తే..
ఆదిత్య ఆలోచనలో పడతాడు. అప్పుడే అక్కడికి దేవి వస్తుంది. అదే సమయంలో అక్కడికి సత్య కూడా వచ్చి దేవిని తన ఇంటికి పంపివమని అంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా పండుగే కదా.. అందరూ ఉన్న దేవి లేకపోతే వాళ్లు కూడా బాధపడతారు కదా అంటూ.. దేవిని వాళ్ళ ఇంటికి పంపివ్వమని అని అంటుంది.ఆ తర్వాత అక్కడికి దేవుడమ్మ వాళ్ళందరూ వస్తారు.
ఇక దేవుడమ్మ కు కూడా విషయం తెలియడంతో.. చెస్ కాంపిటీషన్ తర్వాత పంపిస్దాం అని అంటుంది. కానీ సత్య ఎలాగైనా పంపించాలి అంటూ మాట్లాడటంతో ఆ మాటలు దూరం నుంచి మాధవ వింటూ సంతోషపడతాడు. కానీ రాధ బాధపడుతూ ఉంటుంది. దేవి కూడా తన ఇంటికి వెళ్తాను అని అక్కడి నుండి వెళ్తుంది.
తట్టుకోలేకపోతున్న ఆదిత్య..
ఇక ఆదిత్య తట్టుకోలేకపోగా.. రాధ మాత్రం చాలా బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. మాధవ దేవిని ఇంటికి తీసుకొని వెళ్తాడు. మరోవైపు రాధ ఇలా జరిగినందుకు బాధపడుతుండగా అప్పుడే భాగ్యమ్మ వచ్చి అక్కడ నీ కుటుంబంలోని ఒక్క దానివి లేవు అంటూ బాధపడుతుంది. ఆ తర్వాత రాధ బాగా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతుంది.
Devatha July 16 Today Episode: మాధవకు సవాల్ విసిరిన రాధ..
ఎలాగైనా ఆ దేవుడు తన కూతుర్ని ఆ ఇంటికి పంపిస్తాడు అని అంటుంది. ఇక సత్య ఆదిత్యతో దేవి గురించి మాట్లాడటంతో.. దేవి నా కూతురు అంటూ నోరు జారుతాడు. ఇక సత్య షాక్ అవ్వగా.. వెంటనే మాట మారుస్తూ మాట్లాడతాడు. ఆ తర్వాత రాధ మాధవతో కోపంగా మాట్లాడుతుంది. ఎలాగైనా తన కూతుర్ని తన భర్త దగ్గరికి పంపిస్తాను అని గట్టిగా అంటుంది. ఆ తర్వాత పిల్లలు ఇద్దరు ఆడుకుందాము అని మాధవ దగ్గరికి వెళ్ళగా మొదట మాధవ నిరాకరిస్తాడు. ఆ తర్వాత దేవి కోసం ఆడటానికి సిద్ధమవుతాడు.