Devatha July 20 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రాధ ఆదిత్యతో చాలా సంతోషంగా మాట్లాడుతుంది. అంతేకాకుండా ఇవ్వాళనే దేవికి నిజం చెప్పేస్తాను అని అంటుంది. మరోవైపు మాధవ అప్పటికే ఒక ప్లాన్ చేసుకొని ఉంటాడు. ఆ సమయంలో దేవి అక్కడికి వచ్చి ఎందుకు సంతోషంగా లేవు నాయనా అని అడుగుతుంది. దాంతో మాధవ ఎమోషనల్ అవుతున్నట్లు కనిపించి డ్రామా క్రియేట్ చేస్తాడు.
కన్నతండ్రి కాదు అంటూ నిజం చెప్పేసిన మాధవ..
ఇంతకాలం ఒక విషయం దాచి పెట్టాను.. నీలాంటి ధైర్యం, తెలివి ఉన్న కూతురు నాకుంటే బాగుండేది అని అనటంతో దేవికి ఏమీ అర్థం కాదు. దాంతో మళ్ళీ ఏంటి అని అడగటంతో.. మాధవ నిజం చెప్పేస్తాడు. నువ్వు నాకన్నా కూతురివి కావు అని.. నేను మీ నాన్నని కాదు అనటంతో దేవి షాక్ అవుతుంది. దేవి ఆ మాటలు నమ్మలేకపోతోంది.
డ్రామా క్రియేట్ చేసిన మాధవ..
ఆ తర్వాత మాధవ నిజంగా నేను మీ కన్న తండ్రిని కాదు అంటూ.. మీ నాన్న ఎప్పుడు మీ అమ్మని తాగొచ్చి కొట్టేవాడు అని.. మీ అమ్మ కడుపులో ఉండగానే బయటికి వెళ్ళిపోతే అప్పుడు నేను దారి చూపించాను అని అంటాడు. అందుకే మీ అమ్మ అలా ఆలోచిస్తుంది అని.. అనటంతో దేవి బాగా ఎమోషనల్ అవుతుంది. అమ్మ అంత బాధ పడిందా అంటూ ఏడుస్తుంది.
షాక్ లో రాధ..
మరోవైపు దేవిని తీసుకొని వస్తాను అని రాధ అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తర్వాత దేవి ఎమోషనల్ అవుతూ రాధ దగ్గరికి వెళ్తుంది. ఇక అసలు విషయం చెప్పటంతో రాధ షాక్ అవుతుంది. నా కన్న తండ్రి నిన్ను బాగా కొట్టేవాడు అంట కదా అంటూ బాగా తన కన్న తండ్రిని బాగా తిడుతుంది. నీచుడు అని అంటుంది. ఆ మాటలు విని రాధ మౌనంగా ఉంటుంది.
ఇక ఆదిత్య కు దేవుడమ్మ ఫోన్ చేయగా దేవి గెలిచింది అని సంతోషంగా చెబుతాడు. దేవుడమ్మ కూడా సంతోషంతో దేవిని ఇంటికి తీసుకొని రమ్మంటుంది. ఆ తర్వాత దేవుడమ్మ ఇంట్లో వాళ్ళందరితో ఆ విషయాన్ని పంచుకొని సంతోషపడుతుంది. అందరూ ఆటను నేర్పించినందుకు ఆదిత్యను కూడా పొగుడుతూ ఉంటారు.
Devatha July 20 Today Episode: బాధపడుతున్న ఆదిత్య..
మరోవైపు మాధవ నీ కన్న తండ్రి కానీ ఈ తండ్రి బయట నీకోసం ఎదురు చూస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక రాధ ఆదిత్య దగ్గరికి వెళ్లి తర్వాత విషయం చెబుతాను అని ఎమోషనల్ అక్కడి నుంచి వెళ్తుంది. దాంతో ఆదిత్య చాలా బాధపడతాడు. కారులో ప్రయాణిస్తూ జరిగిన విషయాలను తలుచుకుంటాడు.
మాధవ కూడా కారులో ప్రయాణిస్తూ సంతృప్తిగా సంతోషపడతాడు. దేవి, రాధ మాత్రం నడుచుకుంటూ వెళ్తారు. దారిలో దేవి మళ్ళీ తన కన్నతండ్రి గురించి మాట్లాడుతుంది. ఆ తండ్రికి దూరమై మంచి పని చేశావు అని అంటుంది. దాంతో రాధ ఈ విషయం గురించి మర్చిపో అని చెబుతుంది.